Umran Malik: ధోనీ, కోహ్లీ చెప్పిన మాటలకు ఉమ్రాన్‌ ఉప్పొంగిపోయాడు

ఒకానొక సందర్భంలో టీమ్‌ఇండియా మాజీ సారథులు మహేంద్రసింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ చెప్పిన మాటలకు ఉమ్రాన్‌ మాలిక్‌ ఉప్పొంగిపోయాడని అతడి తండ్రి అబ్దుల్‌ రషీద్‌ హర్షం వ్యక్తం చేశారు...

Published : 27 Apr 2022 01:33 IST

(Photos: Kohli and Umran Malik Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకానొక సందర్భంలో టీమ్‌ఇండియా మాజీ సారథులు మహేంద్రసింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ చెప్పిన మాటలకు ఉమ్రాన్‌ మాలిక్‌ ఉప్పొంగిపోయాడని అతడి తండ్రి అబ్దుల్‌ రషీద్‌ హర్షం వ్యక్తం చేశారు. టీమ్‌ఇండియాలో ఉమ్రాన్‌ భవిష్యత్తు తారగా ఎదుగుతాడని వారు చెప్పినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం జరుగుతోన్న 15వ సీజన్‌లో హైదరాబాద్‌ పేసర్‌ ఉమ్రాన్‌ 150 కిమీ వేగంతో బంతుల్ని బుల్లెట్లలా సంధిస్తున్నాడు. దీంతో ప్రత్యర్థులు పరుగులు చేయలేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోన తన కుమారుడి గురించి ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంగా రషీద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ధోనీ, కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లు నా కుమారుడితో ఏం చెప్పారో.. ఆ విషయాలను అతడు నాతో పంచుకున్నాడు. నా కుమారుడు టీమ్‌ఇండియా భవిష్యత్తు తారగా ఎదుగుతాడని వారు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ విషయం నాతో చెప్పేటప్పుడు అతడెంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇద్దరు దిగ్గజాల నుంచి అంత గొప్ప మాటలు వచ్చేసరికి చాలా సంబరపడ్డాడు’ అని ఉమ్రాన్‌ తండ్రి పేర్కొన్నాడు. అలాగే తన కుమారుడిని టీమ్‌ఇండియాలో చూడాలని, ఏదో ఒకరోజు ప్రపంచకప్‌లోనూ అతడు ఆడాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కచ్చితంగా ఆడతాడనే నమ్మకం కూడా ఉందన్నారు. దీంతో దేశం గర్వపడే స్థితికి ఎదుగుతాడని ఆకాక్షించాడు. ఇవి తన కలలని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని