
Under-19 World Cup : ఐర్లాండ్‌తో మ్యాచ్.. అదరగొడుతున్న భారత ఓపెనర్లు
ఇంటర్నెట్ డెస్క్: అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమ్ఇండియా 25 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 162 పరుగులు చేసింది. క్రీజ్‌లో రఘువన్షి (78*), హర్నూర్ సింగ్ (74*) ఉన్నారు. మొదటి రెండు ఓవర్లు ఆచితూచి ఆడిన ఓపెనర్లు.. ఆ తర్వాత రెచ్చిపోయారు. ఐర్లాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. రెగ్యులర్ సారథి, ఉపసారథి యాష్ ధుల్, రషీద్ లేకుండానే యువ భారత్ బరిలోకి దిగింది. నిషాంత్ సింధు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
జట్టు వివరాలు:
భారత్: రఘువన్షి, హర్నూర్ సింగ్, రాజ్ బవా, నిషాంత్ సంధు (కెప్టెన్), కౌషల్ తంబే, దినేశ్ బనా, గార్వ్సంగ్వాన్, విక్కీ ఓత్సవాల్, గౌతమ్, రాజ్‌వర్థన్, రవికుమార్
ఐర్లాండ్: లియామ్ దొహెర్తీ, డేవిడ్ విన్సెట్, జాక్ డిక్సన్, జాషువా కోక్స్, టిమ్ టెక్టర్ (కెప్టెన్), ఫిలిప్స్, స్కాట్, నాథన్, మాథ్యూ, జామీ ఫోర్బ్స్, ముజామిల్