Published : 10 Mar 2022 16:19 IST

Novak Djokovic : అమెరికాలోని రెండు టోర్నీల నుంచి వైదొలిగిన జకోవిచ్‌

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ వెల్స్‌, మియామీ టోర్నమెంట్లలో పాల్గొనడం లేదని టెన్నిస్‌ స్టార్‌, 20 గ్రాండ్‌స్లామ్‌ల ఛాంపియన్‌ నొవాక్ జకోవిచ్‌ ప్రకటించాడు. వ్యాక్సినేషన్‌ తీసుకోకపోవడంతో అమెరికాలో పర్యటించేందుకు అనుమతి లేదు. దీంతో జకోవిచ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో కొవిడ్ టీకా వేయించుకోకపోవడంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ పాల్గొనని విషయం తెలిసిందే. ఇప్పటికే కాలిఫోర్నియా వేదికగా ప్రారంభమైన ఇండియన్‌ వెల్స్ డ్రా లిస్ట్‌లో జకోవిచ్‌ పేరు ఉంది. అయితే విదేశీయులు తప్పనిసరిగా వ్యాక్సినేట్‌ అయి ఉండాలని
అమెరికా ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ఇండియన్‌ వెల్స్‌ టోర్నీ నుంచి తప్పుకున్నట్లు జకోవిచ్‌ తెలిపాడు. అదేవిధంగా మార్చి 21 నుంచి మొదలయ్యే మియామీ టోర్నమెంట్‌ నుంచీ వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. 


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని