WPL: బ్యాట్‌పై ‘ధోనీ’ పేరు రాసుకుని.. గుజరాత్‌పై అర్ధ సెంచరీ బాదేసి..
మహిళల ప్రీమియర్ లీగ్(WPL) లో యూపీ జట్టు అదిరే ఆరంభం చేసింది. ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో యూపీ బ్యాటర్ కిరణ్ నవ్‌గిరె ఆటతో పాటు ప్రత్యేక ‘బ్యాట్’తో అందర్నీ ఆకర్షించింది.
ఇంటర్నెట్ డెస్క్: తొలి మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభమై కేవలం రెండు రోజులే అయినా.. ఉత్కంఠకు కొదవలేదు. అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న మహిళా క్రికెటర్లు.. మైదానంలో అద్భుతాలు చేస్తున్నారు. ఆదివారం గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants), యూపీ వారియర్స్ (UP Warriorz) మధ్య జరిగిన లీగ్ మ్యాచే అందుకు ఉదాహరణ. ఓడిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకున్న యూపీ జట్టు.. గుజరాత్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో యూపీ బ్యాటర్ కిరణ్ నవ్‌గిరె (Kiran Navgire) అర్ధశతకంతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే.. ఆట కంటే కూడా ఆమె పట్టుకున్న బ్యాట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అంతలా ఆ బ్యాట్ ప్రత్యేకత ఏంటంటే.. దానిపై క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పేరు చేతితో రాసి ఉండటమే..!
కిరణ్ నవ్‌గిరె (Kiran Navgire) బ్యాట్‌పై ఎలాంటి స్పాన్సర్ లేబుళ్లు లేవు. దానికి బదులుగా ఆమె ‘MSD 07’ అని రాసుకుంది. ఆదివారం నాటి మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఓ కామెంటేటర్ దాన్ని గుర్తించారు. దీంతో ఆమె బ్యాట్ (Bat) ఫొటో ఇప్పుడు వైరల్ అయ్యింది. అయితే, దీనిపై మ్యాచ్ అనంతరం కిరణ్ మాట్లాడుతూ.. ‘‘2011లో టీమ్‌ఇండియా పురుషుల జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు అంతటా ఒకటే పేరు మార్మోగింది. ఆయనే మహేంద్ర సింగ్ ధోనీ. అప్పటి నుంచి నేను ఆయన అభిమానిగా మారిపోయా. ఆ సమయంలో మహిళల క్రికెట్ అనేది ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. పురుషుల క్రికెట్ చూస్తూ పెరిగాను. ధోనీ (MS Dhoni)లాగా సిక్స్‌లు కొట్టాలన్న ఒకటే ఆలోచనతో క్రికెట్ నేర్చుకున్నా’’ అని మాజీ సారథిపై తన అభిమానాన్ని బయటపెట్టింది.
ఆదివారం నాటి మ్యాచ్‌లో యూపీ జట్టు తడబడుతున్న సమయంలో కిరణ్ నిలబడింది.. 43 బంతుల్లో 53 పరుగులతో (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించి యూపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. అయినప్పటికీ యూపీ ఓటమి అంచుల్లోనే ఉండగా.. ఆఖరి నాలుగు ఓవర్లలో గ్రేస్ హారిస్ విజృంభించి యూపీకి సంచలన విజయాన్ని అందించింది. ఇక, మహారాష్ట్రకు చెందిన కిరణ్ నవ్‌గిరె భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్