UPW vs DCW: యూపీని చిత్తు చేసి ఫైనల్స్‌కు దూసుకెళ్లిన దిల్లీ క్యాపిటల్స్‌

యూపీపై దిల్లీ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

Updated : 21 Mar 2023 22:53 IST

ముంబయి: మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (WPL)లో లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో యూపీపై దిల్లీ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పాయింట్ల పరంగా (12) ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ సమంగా ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో దిల్లీ తుదిపోరుకు అర్హత సాధించింది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ముంబయి, యూపీ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. దీంట్లో గెలుపొందిన జట్టు.. టైటిల్ పోరులో దిల్లీతో తలపడుతుంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ వారియర్స్‌ 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని దిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దిల్లీ బ్యాటర్లలో మెగ్‌ లానింగ్‌(39: 23 బంతుల్లో) మారికాప్‌ (34 నాటౌట్‌ : 31 బంతుల్లో ), ఎలీస్‌ క్యాప్సే(34: 31 బంతుల్లో) రాణించారు.  యూపీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ రెండు, యశ శ్రీ, సోఫీ ఎకిల్ స్టోన్‌ ఒక వికెట్ పడగొట్టారు.

తాహిలా మెక్‌గ్రాత్ (58; 32 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించడంతో యూపీ గౌరవప్రదమై స్కోరును చేసింది. అలీసా హీలే (36; 34 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌),  శ్వేతా సెహ్రవత్‌ (19),  సిమ్రాన్ షేక్ (11) పరుగులు చేయగా.. కిరణ్ నవ్‌గిరె (2), దీప్తి శర్మ (3) సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు.  దిల్లీ బౌలర్లలో క్యాప్సే మూడు, రాధా యాదవ్ రెండు, జోనాసెన్‌ ఒక వికెట్ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని