UPWw Vs GGw: రాణించిన హర్లీన్‌ డియోల్.. యూపీ వారియర్స్‌ లక్ష్యం ఎంతంటే?

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2023)లో భాగంగా యూపీ వారియర్స్‌, గుజరాత్ జెయింట్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.

Updated : 05 Mar 2023 21:09 IST

ముంబయి: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2023)లో భాగంగా యూపీ వారియర్స్‌, గుజరాత్ జెయింట్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. హర్లీన్‌ డియోల్‌ (46; 32 బంతుల్లో 7 ఫోర్లు) రాణించగా.. సబ్బినేని మేఘన (24; 15 బంతుల్లో 5 ఫోర్లు), ఆష్లీన్‌ గార్డెనర్ (25; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) పర్వాలేదనిపించారు. దేవికా వైద్య వేసిన 17 ఓవర్‌లో వరుసగా నాలుగు బంతులను బౌండరీకి పంపించిన డియోల్‌.. అంజలి శర్వాణి వేసిన తర్వాతి ఓవర్‌లో మెక్‌గ్రాత్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరింది. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తాహిలా మెక్‌గ్రాత్, అంజలి చెరో వికెట్ పడగొట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని