UPWw Vs GGw: గుజరాత్‌కు మళ్లీ ఓటమి.. బోణీ కొట్టిన యూపీ వారియర్స్
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023)లో తన మొదటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైన గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) తన తీరు మార్చుకోలేదు. ఉత్కంఠభరింతంగా సాగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్(UP Warriorz) చేతిలో 3 వికెట్ల తేడాతో మరో ఓటమిని మూటగట్టుకుంది.
ముంబయి: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023)లో తన మొదటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైన గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) తన తీరు మార్చుకోలేదు. ఉత్కంఠభరింతంగా సాగిన మ్యాచ్‌లో యూపీ(UP Warriorz) చేతిలో గుజరాత్ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో యూపీ జట్టు పాయింట్ల ఖాతాను తెరిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యాన్ని యూపీ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కిరణ్ నవ్‌గిరే (53; 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదగా.. చివర్లో గ్రేస్ హ్యారిస్ (59; 26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. యూపీ విజయానికి ఆఖరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా.. గ్రేస్ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది ఒక బంతి మిగిలుండగానే జట్టును విజయతీరాలకు చేర్చింది. ఎక్లెస్టోన్ (22; 12 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఆమెకు సహకారం అందించింది. అలీసా హీలే (7), శ్వేతా సెహ్రావత్ (5), తాహిలా మెక్‌గ్రాత్ (0), దీప్తి శర్మ (11), సిమ్రాన్ షేక్ (0), దేవికా వైద్య (4) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ (5/16) ఆకట్టుకోగా.. మాన్సీ జోషి, అనాబెల్ ఒక వికెట్ పడగొట్టింది.
గుజరాత్ బ్యాటర్లలో హర్లీన్ డియోల్ (46; 32 బంతుల్లో 7 ఫోర్లు) రాణించగా.. సబ్బినేని మేఘన (24; 15 బంతుల్లో 5 ఫోర్లు), ఆష్లీన్ గార్డెనర్ (25; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, తాహిలా మెక్‌గ్రాత్, అంజలి తలో వికెట్ తీశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Modi-Kishida: కిషిదకు పానీపూరీ రుచి చూపించిన మోదీ
-
India News
Amruta Fadnavis: 750 కిలోమీటర్ల ఛేజింగ్.. ఆపై క్రికెట్ బుకీ అరెస్టు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Nara Devansh: నారా దేవాన్ష్ పుట్టినరోజు.. తితిదేకు లోకేశ్-బ్రాహ్మణి విరాళం
-
General News
NIMS: నిమ్స్‌లో నర్సుల ధర్నా.. నిలిచిన ఎమర్జెన్సీ సర్జరీలు!
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ రెండో కారు, దుస్తులు సీజ్.. పంజాబ్ దాటేసి ఉంటాడా?