MIw vs UPw: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో యూపీ విజయం.. ముంబయికి తొలి ఓటమి
డబ్ల్యూపీఎల్ (WPL 2023)లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది.
ముంబయి: ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో యూపీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ముంబయి ఇండియన్స్ టోర్నీలో తొలిసారి ఓటమిపాలైంది. 128 పరుగుల లక్ష్యం చిన్నదే అయినప్పటికీ.. యూపీ అతి కష్టం మీద చేరుకుంది. మెక్‌గ్రాత్ (38; 25 బంతుల్లో 6×4,1×6), గ్రేస్ హారిస్ (39; 28 బంతుల్లో 7×4) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ముంబయి బౌలర్లలో అమేలియా కేర్ రెండు వికెట్లు పడగొట్టగా.. బ్రంట్, హెయిలీ మ్యాథ్యూస్, వాంగ్ తలో వికెట్ తీశారు.
లక్ష్య ఛేదన ప్రారంభించిన యూపీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ దేవికా వైద్య (1) తీవ్ర నిరాశపరిచింది. మాథ్యూస్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే హర్మన్ ప్రీత్ కౌర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. మరో ఓపెనర్ హీలీ (8) కూడా తక్కువ పరుగులకే వెనుదిరింది. వాంగ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్‌తో కలిసి నవ్‌గిరే ఇన్నింగ్స్ (12) నిర్మించే ప్రయత్నం చేసింది. కానీ జట్టు స్కోరు 27 పరుగుల వద్ద బ్రంట్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి భాటియాకు దొరికిపోయింది.
ఆ తర్వాత హారిస్‌తో కలసి మెక్‌గ్రాత్ ఇన్నింగ్స్ నిర్మించింది. ఆచితూచి ఆడుతూ... వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇద్దరూ కలసి స్కోరుబోర్డును ముందుకు కదిలించారు. అయితే, ఈ జోడీని అమేలియా కెర్ విడగొట్టింది. జట్టు స్కోరు 71 పరుగుల వద్ద మెక్‌గ్రాత్ కాట్ ఆండ్ బౌల్డ్‌గా వెనుదిరిగింది. కెర్ వేసిన 15.4వ బంతికి వాంగ్ కు క్యాచ్ ఇచ్చి హారిస్ వెనుదిరిగింది. దీంతో జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ (13*), సోఫీ (16*) అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో పది వికెట్లు నష్టపోయి 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ హీలీ మ్యాథ్యూస్ (35; 30 బంతుల్లో 1X4,3X6) పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (25), వాంగ్ (32) మినహా మిగతావారెవ్వరూ పెద్దగా రాణించలేదు. యూపీ బౌలర్లలో ఎక్లెస్టోన్ 3 వికెట్లు పడగొట్టగా, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు, అంజలి శ్రావణ ఒక వికెట్ తీశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచే సుకేశ్ మరో ప్రేమలేఖ
-
Ap-top-news News
‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
Sports News
నిఖత్ కొట్టేయ్ మళ్లీ.. నేడు జరీన్ ఫైనల్
-
Movies News
భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..