Emma Raducanu: యూఎస్‌ ఓపెన్ ఛాంపియన్‌ ఎమ్మాకు కరోనా పాజిటివ్‌

యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్ ఎమ్మా రదుకాను కరోనా బారిన పడింది. దీంతో ‘ముబడాల వరల్డ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌’లో భాగంగా డిసెంబరు 16 - 18 మధ్య అబుదాబిలో జరగాల్సిన ఎగ్జిబిషన్..

Published : 14 Dec 2021 16:16 IST

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్ ఎమ్మా రదుకాను కరోనా బారిన పడింది. దీంతో ‘ముబడాల వరల్డ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌’లో భాగంగా డిసెంబరు 16 - 18 మధ్య అబుదాబిలో జరగాల్సిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు ఆమె దూరమైంది. ‘అబుదాబిలో అభిమానుల మధ్య మ్యాచ్‌ ఆడాలని చాలా ఆశతో ఎదురు చూశాను. కానీ, దురదృష్టవశాత్తూ కరోనా బారిన పడ్డాను. మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. కొవిడ్‌ నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. త్వరలోనే కోర్టులో అడుగు పెడతాను’ అని రదుకాను పేర్కొన్నారు. ఈ విషయంపై టోర్నమెంట్ నిర్వాహకులు స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాగా, క్రిస్టమస్‌ తర్వాత రదుకాను ఆస్ట్రేలియా బయలు దేరాల్సి ఉంది. గ్రాండ్‌ స్లామ్‌లో భాగంగా ఆమె వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొననుంది.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని