Cricket: 6 బంతుల్లో ఆరు సిక్స్‌లు..మనోడు మాములుగా ఆడలేదు!

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు అనగానే భారతీయులకు ఠక్కున గుర్తుకు వచ్చే పేరు యువరాజ్‌ సింగ్‌. 2017లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది రికార్డు సృష్టించాడు. గిబ్స్‌, పొలార్డ్‌ కూడా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి రికార్డులోకెక్కారు. తాజాగా

Published : 11 Sep 2021 02:20 IST

(Photo: ICC Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు అనగానే భారతీయులకు ఠక్కున గుర్తుకు వచ్చే పేరు యువరాజ్‌ సింగ్‌. 2017లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసి ఆరు బంతులను ఆరు సిక్స్‌లు బాది రికార్డు సృష్టించాడు. గిబ్స్‌, పొలార్డ్‌ కూడా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి రికార్డులోకెక్కారు. తాజాగా ఈ జాబితాలోకి భారత సంతతి ఆటగాడు చేరాడు. 

వివరాల్లోకి వెళితే..ఒమన్‌ వేదికగా పాపువా న్యూగినియా, అమెరికా జట్లు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది.  భారత సంతతికి చెందిన అమెరికా ఆటగాడు జస్కరన్ మల్హోత్రా.. (173* ; 124 బంతుల్లో  16×6, 4×4) భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. అలవోకగా సిక్స్‌లు బాదుతూ పాపువా న్యూ గినియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అమెరికా ఇన్నింగ్స్‌లోని ఆఖరి ఓవర్‌ని గౌడి టోకా వేశాడు. ఈ ఓవర్‌లో మల్హోత్రా రెచ్చిపోయాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. అమెరికా క్రికెట్‌ చరిత్రలో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ క్రమంలో 173 పరుగులు వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. అమెరికా క్రికెట్‌ జట్టుకి అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత సెంచరీ బాదిన మొదటి క్రికెటర్‌గా మల్హోత్రా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా 134 పరుగుల తేడాతో విజయం సాధించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని