
Venkatesh Iyer: హర్భజన్ ముందే చెప్పాడు .. కానీ నమ్మలేకపోయా: అయ్యర్
ఇంటర్నెట్ డెస్క్: వెంకటేశ్ అయ్యర్‌కు ఈ ఏడాది సమ్‌థింగ్ స్పెషల్... తన తొలి ఐపీఎల్ సీజన్లోనే అదరగొట్టిన ఈ ఆల్‌రౌండర్‌కు భారత జట్టులోకి ఆహ్వానం అందింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన లెఫ్ట్ఆర్మ్ బ్యాటర్, కుడిచేతివాటం మీడియం పేసర్ వెంకటేశ్ అయ్యర్ భారత్ జట్టు తరఫున టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. కివీస్‌తో తొలి మ్యాచ్‌లో బౌలింగ్ చేయని అయ్యర్ (4) బ్యాటింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో రెండో బంతికే పెవిలియన్‌కు చేరాడు. కీలకమైన ఆఖరి ఓవర్లో ఫోర్ కొట్టడంతో ఒత్తిడి తగ్గి కివీస్‌పై టీమ్ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించగలిగింది. మరోవైపు రెండు దశల్లో జరిగిన ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచెలో వెంకటేశ్ అయ్యర్ దుమ్మురేపాడు. కేకేఆర్ ఫైనల్‌కు దూసుకెళ్లడంలో ముఖ్యభూమిక పోషించాడు. కేకేఆర్ తరఫున 10 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ 128 స్ట్రైక్‌రేట్‌తో 370 పరుగులు సాధించారు. అందులో నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 67 పరుగులు. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లను పడగొట్టాడు.
అయితే గత ఐపీఎల్లో తన ప్రదర్శనపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ముందే అంచనా వేశాడని వెంకటేశ్ అయ్యర్ తెలిపాడు. ఐపీఎల్ 14 సీజన్లో హర్భజన్ కూడా కేకేఆర్ జట్టులోనే ఉన్నాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి ముందే హర్భజన్ నాతో సూటిగా చెప్పేశాడు. అయితే అప్పటికి నేను తుది జట్టులో ఉంటానో లేదో కూడా తెలియదు. భజ్జీ నన్ను నెట్‌ప్రాక్టీస్ సెషన్స్‌లో చూసి ఉంటాడమో. ‘ఈసారి కేకేఆర్ అంటే నువ్వే. నాకు ఆ నమ్మకం ఉంది. మీకు అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా చేసి చూపిస్తారు’ అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. నిజం చెప్పాలంటే నేను నమ్మలేదు. అసలు ప్రాక్టీస్‌లో నా బ్యాటింగ్ కూడా చూసి ఉండడు. ఎందుకు ఈయన ఈ విధంగా చెబుతున్నాడు అని కూడా ఆలోచించా. భజ్జీలోని మంచి వ్యక్తిత్వం నన్ను ఓదార్చడం కోసమే ఇలా చెప్పిందేమో అనుకున్నా’’ అని వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. అయితే ఐపీఎల్లో రాణించి కేకేఆర్ ఫైనల్‌కు దూసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించినందుకు నిజంగా సంతోషపడినట్లు వివరించాడు.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.