IPL 2022: నన్ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన ఫ్రాంచైజీ కేకేఆర్‌: వెంకటేశ్ అయ్యర్

టీమ్‌ఇండియా ఆటగాడు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న వెంకటేశ్‌ అయ్యర్‌కు జాక్‌పాట్ తగిలింది. ఈ స్టార్‌ఆల్‌రౌండర్‌ను గత వేలంలో కేవలం రూ.20 లక్షలకే కొనుగోలు చేసిన కేకేఆర్‌.. ఈసారి ఏకంగా రూ.8 కోట్లు

Published : 02 Dec 2021 19:45 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా ఆటగాడు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న వెంకటేశ్‌ అయ్యర్‌కు జాక్‌పాట్ తగిలింది. ఈ స్టార్‌ఆల్‌రౌండర్‌ను గత వేలంలో కేవలం రూ.20 లక్షలకే కొనుగోలు చేసిన కేకేఆర్‌.. ఈసారి ఏకంగా రూ.8 కోట్లు పెట్టి అతడిని సొంతం చేసుకుంది.  ఐపీఎల్‌-2021 రెండో అంచెలో వెంకటేశ్‌ అయ్యర్‌ అంచనాలకు మించి రాణించాడు. మొత్తం 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు సాధించి జట్టును ఫైనల్‌ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలో కూడా స్థానం సంపాదించాడు. అందుకే అతడిని రిటెయిన్‌ చేసుకునేందుకు కేకేఆర్‌.. ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు చేసింది.

ఈ నేపథ్యంలో వెంకటేశ్‌ అయ్యర్ మాట్లాడాడు. తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో భాగం అయినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. తనపై విశ్వాసం ఉంచినందుకు కేకేఆర్‌ మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈడెన్‌ గార్డెన్స్‌లో ప్రేక్షకుల మధ్య ఆడటానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. గత ఐపీఎల్‌ (2021)  సీజన్‌లో కోల్‌కతా జట్టు సహాయక సిబ్బంది మద్దతుగా నిలిచారని, భారత్‌ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టుకు తను ఎంపిక కావడానికి వారందరి సహకారం ఉపయోగపడిందని వెంకటేశ్ చెప్పాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వెంకటేశ్‌ అయ్యర్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

"నేను తిరిగి వచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉన్నాను. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నాకు చాలా పెద్ద అవకాశాన్ని ఇచ్చింది.  క్రికెట్ ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన ఫ్రాంచైజీ కేకేఆర్‌" అని  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో వెంకటేశ్‌ అన్నాడు. ఇక, వెంకటేశ్‌ అయ్యర్‌తోపాటు వరుణ్ చక్రవర్తి (రూ. 8 కోట్లు), విండీస్‌ ఆటగాళ్లు ఆండ్రీ రసెల్ (రూ.12 కోట్లు), సునీల్ నరైన్‌లను (రూ. 6 కోట్లు) కేకేఆర్‌ రిటెయిన్‌ చేసుకుంది. 

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని