Team India: దేశంలో చాలా టాలెంట్‌ ఉంది.. పేరున్నంత మాత్రాన ఆడించొద్దు

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఫామ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నానాటికీ అతడి ప్రదర్శన ఏమాత్రం మెరుగు పడకపోతుండటంపై మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు...

Published : 12 Jul 2022 02:07 IST

విరాట్‌ కోహ్లీపై మాజీ క్రికెటర్‌ ఘాటు వ్యాఖ్యలు

(Photo: Venkatesh Prasad Twitter Video Screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఫామ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నానాటికీ అతడి ప్రదర్శన ఏమాత్రం మెరుగు పడకపోతుండటంపై మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఒక్క పరుగే చేసి ఔటైన విరాట్‌ కోహ్లీ మూడో టీ20లోనూ 11 పరుగులకే పెవిలియన్‌ చేరి మరోసారి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్‌ ప్రసాద్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ జట్టు ఎంపికపై విమర్శనాస్త్రాలు సంధించాడు. సరిగ్గా ఆడని ఆటగాళ్లను పక్కనపెట్టాలని అభిప్రాయపడ్డాడు.

‘ఇంతకుముందు ఎవరైనా సరిగ్గా ఆడకపోతే ఎంత పేరున్న ఆటగాడినైనా పక్కన పెట్టేవారు. సౌరభ్‌, సెహ్వాగ్‌, యువరాజ్‌, జహీర్‌, హర్భజన్‌ ఇలా ప్రతి ఒక్కరూ ఫామ్‌ కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెట్‌లోకి వెళ్లి అక్కడ రాణించి తిరిగి జాతీయ జట్టుకి వచ్చేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రస్తుతం ఎవరైనా ఫామ్‌లో లేకపోతే విశ్రాంతి ఇస్తున్నారు. దీనివల్ల ఏ ఉపయోగమూ లేదు. దేశంలో చాలా టాలెంట్‌ ఉంది. కేవలం వాళ్లకు పేరుందని చెప్పి ఆడించకూడదు. అనిల్‌ కుంబ్లే వంటి దిగ్గజ ఆటగాడు కూడా చాలా సందర్భాల్లో జట్టుకు దూరమయ్యాడు. టీమ్ఇండియా భవిష్యత్‌ బాగుండాలంటే ఇకనైనా భారీ చర్యలు తీసుకోక తప్పదు’ అని వెంకటేశ్‌ ప్రసాద్‌ ట్వీట్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని