దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

మహమ్మారి కరోనా వ్యాప్తి అనంతరం భారత మహిళల జట్టు తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ మొదలుపెట్టనుంది. లఖనవూ వేదికగా మార్చి 7 నుంచి దక్షిణాఫ్రికాతో అయిదు వన్డేలు....

Published : 27 Feb 2021 16:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహమ్మారి కరోనా వ్యాప్తి అనంతరం భారత మహిళల జట్టు తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ మొదలుపెట్టనుంది. లఖనవూ వేదికగా మార్చి 7 నుంచి దక్షిణాఫ్రికాతో అయిదు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి. కాగా, వన్డే, టీ20 ఫార్మాట్లకు టీమిండియాను బీసీసీఐ శనివారం ప్రకటించింది. మిథాలీ రాజ్‌ 50 ఓవర్ల ఆటకు, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పొట్టిఫార్మాట్‌కు నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియర్‌ పేసర్‌ శిఖా పాండే, వికెట్‌కీపర్‌ తానియా భాటియాకు జట్టులో చోటు దక్కలేదు. యువ బ్యాటర్ షెఫాలీ వర్మను టీ20లకే పరిమితం చేశారు. వన్డే జట్టులో చోటు దక్కించుకున్న వికెట్‌కీపర్‌ శ్వేత వర్మ అరంగేట్రం చేయనుంది.

వన్డే జట్టు

మిథాలీ (కెప్టెన్‌), స్మృతి మంధాన, జెమిమా, పూనమ్‌ రౌత్‌, ప్రియా పునియా, ఎస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్‌, హేమలత, దీప్తి శర్మ, సుష్మ వర్మ (వికెట్‌కీపర్‌), శ్వేత వర్మ (వికెట్‌కీపర్), రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, జులన్ గోస్వామి, మన్సి జోషి, పూనమ్‌ యాదవ్‌, ప్రత్యూష, మోనిక పటేల్‌

టీ20 జట్టు

హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి, షెఫాలీ, జెమిమా, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, హర్లీన్‌, సుష్మ (వికెట్‌కీపర్‌), పర్వీన్‌ (వికెట్‌కీపర్‌), అయూషి సోని, అరుంధతి, రాధా యాదవ్‌, రాజేశ్వరి, పూనమ్‌ యాదవ్‌, మన్సి జోషి, మోనిక పటేల్‌, ప్రత్యూష, సిమ్రాన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని