IND vs BAN: అలా ఆడటం భారత్‌కు తెలియదు.. కేఎల్‌ వ్యాఖ్యలపై డీకే స్పందన

బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముంగిట కేఎల్‌ రాహుల్‌(KL Rahul) చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని దినేశ్‌ కార్తిక్‌ తెలిపాడు.

Updated : 15 Dec 2022 14:44 IST

చట్‌గావ్‌:  టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసు నేపథ్యంలో బంగ్లాదేశ్‌(IND vs BAN) సిరీస్‌లో దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉందని కేఎల్‌ రాహుల్‌ మ్యాచ్‌కు ముందు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ తాజాగా స్పందించాడు. తాను కేఎల్‌ రాహుల్‌(KL Rahul)తో ఏకీభవించనని తెలిపాడు. చట్‌గావ్‌లో ఉన్న పిచ్‌పై ఇంగ్లాండ్‌ జట్టు ఆడినట్టు బజ్‌బాల్‌ తరహా ప్రదర్శన సాధ్యం కాదని పేర్కొన్నాడు.

‘‘నాకు తెలిసి ఇలాంటి వికెట్‌ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. సాధారణంగా నాణ్యమైన ఆటగాళ్లు లేనప్పుడు బ్యాటింగ్‌ వైఫల్యాలు బయటపడుతుంటాయి. నియంత్రణ కోల్పోకుండా ఆడితే చాలు. వికెట్‌ను కాపాడుకోవడానికి గొప్ప టెక్నిక్‌లేమీ అవసరం లేదు. ఇక ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ క్రికెట్‌ ఆడినట్టుగా టీమ్‌ఇండియా ఆడదు. అది జట్టు డీఎన్‌ఏలోనే లేదు. నిజానికి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రేసులో మంచి స్కోరుతో నిలవడానికి ఈ మ్యాచ్‌లు చాలా కీలకమైనవి. అందుకే, వేగం పెంచి ఆడాలని వారు భావిస్తున్నారు. కానీ, అందుకు ఇది సరైన సమయం కాదు. ఇక్కడ దూకుడుగా ఆడేందుకు పిచ్‌ ఏమాత్రం సహకరించదు’’ అని డీకే(Dinesh karthik) అభిప్రాయపడ్డాడు. 

బుధవారం ప్రారంభమైన మొదటి టెస్ట్‌ తొలి రోజు ఛతేశ్వర్‌ పుజారా, శ్రేయస్‌ అయ్యర్‌ కలిసి భారత్‌ 278/6 స్కోర్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆట ప్రారంభంలోనే శ్రేయస్‌ అయ్యర్‌(86) వికెట్‌ను టీమ్‌ఇండియా కోల్పోయింది. లంచ్‌ బ్రేక్‌ తర్వాత వరకు ఆడిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్‌ అర్ధశతకం చేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని