Imram Tahir : తాహిర్‌కు రొనాల్డో పూనాడు.. వికెట్‌ సంబరం ఎలా చేశాడో చూసేయండి..!

ఇమ్రాన్‌ తాహిర్‌.. దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్‌..  43 ఏళ్ల ‘యువకుడు’.. ఇదేంటి..? ఇంత వయస్సు ఉన్న క్రికెటర్‌ను యువకుడు అంటారేంటి అనుకోవద్దు.. ఆయనకు...

Published : 17 Aug 2022 01:57 IST

(ఫొటో సోర్స్‌: ది హండ్రెడ్‌ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: ఇమ్రాన్‌ తాహిర్‌.. దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్‌..  43 ఏళ్ల ‘యువకుడు’.. ఇదేంటి..? ఇంత వయస్సు ఉన్న క్రికెటర్‌ను యువకుడు అంటారేంటి అనుకోవద్దు.. ఆయనకు ఏజ్‌ పెరిగినా.. మైదానంలోకి దిగి వికెట్‌ తీస్తే మాత్రం యువకుడికి ఏమాత్రం తీసిపోడు. అలా ఉంటుంది మరి తాహిర్‌తో! ఇప్పుడెందుకు తాహిర్‌ గురించి అంటారా..? తాజాగా ఓ మ్యాచ్‌లో వికెట్‌ తీయగానే తన ‘మారథాన్‌’ సెలబ్రేషన్స్‌కు రొనాల్డ్‌ స్టైల్‌ను జత చేశాడు.

ది హండ్రెడ్‌ టోర్నమెంట్‌లో ఇమ్రాన్‌ తాహిర్‌ బర్మింగ్‌హామ్‌ ఫోనిక్స్‌ జట్టు తరఫున ఆడుతున్నాడు. నిన్న ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇమ్రాన్‌ తాహిర్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన ఆ జట్టు బ్యాటర్ మలన్ (9) బ్రూక్స్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. తనకు వికెట్‌ దక్కిన ఆనందంతో తాహిర్‌ (1/26) మైదానం నలువైపులా పరుగులు తీసి రొనాల్డో స్టైల్‌లో చేతులను ఆడించి సంబరాలు జరుపుకొన్నాడు. ఇలాంటి స్టైల్‌ను టీమ్‌ఇండియా బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ కూడా అప్పుడప్పుడు చేసేవాడు. ఇప్పుడు తాహిర్‌ అలా చేయడంతో నెట్టింట్లో ఆ వీడియో వైరల్‌గా మారింది. అదేంటో మీరూ చూసేయండి మరి!


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని