KL Rahul : కేఎల్ రాహుల్‌కు ఝులన్‌ గోస్వామి బౌలింగ్‌.. ఎక్కడంటే..?

ఝులన్‌ గోస్వామి బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌ బ్యాటింగ్‌.. ఇదేంటి ఒకరేమో టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌.. మరొకరు ...

Published : 19 Jul 2022 13:40 IST

ఇంటర్నెట్ డెస్క్: ఝులన్‌ గోస్వామి బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌ బ్యాటింగ్‌.. ఇదేంటి ఒకరేమో టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌.. మరొకరు పురుషుల టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌.. వీరిద్దరూ కలిసి ఎప్పుడు ఆడారు..?అని కంగారు పడకండి.. ఝులన్‌, రాహుల్‌ ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియో సోషల్ మీడియలో చక్కర్లు కొడుతోంది. ఝులన్‌ గోస్వామి బౌలింగ్‌ చేయగా.. కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్ చేశాడు. ఫుల్‌లెంగ్త్‌తోపాటు అవుట్‌సైడ్ ఆఫ్‌స్టంప్‌నకు సంబంధించిన బంతులను రాహుల్‌ అడ్డుకున్నాడు. 

ప్రస్తుతం కేఎల్ రాహుల్‌ ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు. జర్మనీలో శస్త్రచికిత్స అనంతరం ఎన్‌సీఏలో ఉంటూ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. జులై 22 నుంచి విండీస్‌ పర్యటన ప్రారంభం కానుంది. మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌ అక్కడకు వెళ్లనుంది. ఈ క్రమంలో నెట్టింట్లో వైరల్‌గా మారిన ప్రాక్టీస్‌ వీడియోను మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు