కుల్‌దీప్‌, సిరాజ్ మధ్య గొడవ జరిగిందా?

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌, పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మధ్య వివాదం జరిగిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. డ్రెస్పింగ్ రూమ్‌లో వీరిద్దరు గొడవ పడ్డారని ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో...

Published : 06 Feb 2021 21:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌, పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మధ్య వివాదం జరిగిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో వీరిద్దరూ గొడవ పడ్డారని ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో అసలు ఏముందంటే.. సెషన్‌ ముగిసిన అనంతరం ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చారు. ఆటగాళ్లతో పాటు డ్రింక్స్‌ బాయ్‌గా ఉన్న కుల్‌దీప్ కూడా వచ్చాడు. వాళ్లకి కోచ్‌ రవిశాస్త్రితో పాటు సిరాజ్‌ స్వాగతం పలికాడు. అయితే వస్తున్న కుల్‌దీప్‌ను సిరాజ్‌ ఒక్కసారిగా మెడ పట్టుకుని ఏదో మాట్లాడాడు. దానికి కుల్‌దీప్‌ ఉలిక్కిపడుతూ రియాక్ట్ అయ్యాడు. 

అయితే ఇద్దరూ గొడవ పడ్డారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేయగా, మరికొందరు అది స్నేహపూర్వక పరిహాసమని అంటున్నారు. మైదానంలో వికెట్లు తీసినప్పుడు ఆటగాళ్లు ఒకరినొకరు ఇలా అభినందించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. కాగా, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సిరాజ్‌, కుల్‌దీప్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. జడేజా గైర్హాజరీలో కుల్‌దీప్‌కు అవకాశం వస్తుందని భావించారంతా. కానీ టీమిండియా యాజమాన్యం నదీమ్‌ను ఎంపిక చేసింది.

ఇవీ చదవండి

రూట్‌’ను తప్పించడం ఎందుకింత కష్టం!

సీన్‌ రిపీట్‌: ఇంగ్లాండ్‌దే పైచేయి


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని