GT vs CSK: చెన్నై మ్యాచా..? మజాకానా..? వ్యూవర్‌షిప్‌లో సరికొత్త రికార్డు
చెన్నై ఆడిందంటే.. మైదానంలోనే కాదు వెలుపలా రికార్డుల మోత మోగాల్సిందే. అందుకు తాజా ఉదాహరణ.. చెపాక్ వేదికగా జరిగిన గుజరాత్ - చెన్నై (GT vs CSK) మ్యాచ్. ఇప్పుడు సరికొత్త రికార్డుతో అలరించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్ ఆడుతుందంటే రికార్డులు బద్దలు కావాల్సిందే. తొలి క్వాలిఫయర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో (GT vs CSK) చెపాక్ వేదికగా చెన్నై తలపడింది. అద్భుతమైన విజయం సాధించి సీఎస్‌కే ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో సూపర్ రికార్డు నమోదైంది. ఛేదనలో చివరి ఓవర్లను అభిమానులు భారీ సంఖ్యలో వీక్షించారు. దీంతో వ్యూవర్‌షిప్ 2.5 కోట్ల మార్క్‌ను తాకింది. గతంలో (ఏప్రిల్ 17న) చెన్నై - ఆర్‌సీబీ మ్యాచ్‌కు 2.4 కోట్ల వ్యూవర్‌షిప్ వచ్చింది. జియో సినిమా తన ట్విటర్‌లో ఈ మేరకు పోస్టు పెట్టింది. ‘కీలకమైన నాలుగు మ్యాచుల్లో (ప్లేఆఫ్స్) ఆరంభంలోనే రికార్డును బ్రేక్ చేశాం. గుజరాత్ - చెన్నై మ్యాచ్‌ను అభిమానులు విశేషంగా ఆదరించారు’’ అని ట్వీట్ చేసింది.
ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌లు కలిపి దాదాపు 1300 కోట్ల వీడియో వ్యూస్‌ను జియో సినిమా దాటేసింది. ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 172/7 స్కోరు చేయగా.. అనంతరం గుజరాత్ 157 పరుగులకు ఆలౌటైంది. ఛేదన సమయంలో రషీద్ ఖాన్ ఉన్నంత వరకు గుజరాత్ పోటీనిచ్చింది. కేవలం 16 బంతుల్లోనే 30 పరుగులు చేసిన రషీద్ ఖాన్ తొమ్మిదో వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. దీంతో టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు.
మ్యాచ్‌కు సంబంధించి మరిన్ని విశేషాలు
- గుజరాత్ టైటాన్స్ తొలిసారి చెన్నై చేతిలో ఓటమిపాలైంది. గత సీజన్‌లో రెండు సార్లు, ఇప్పుడు రెండు సార్లు ఇరు జట్లు తలపడ్డాయి. మూడు మ్యాచుల్లో గెలిచి, ఒక్క దాంట్లో ఓటమిపాలైంది.
- ఛేదనలో గుజరాత్‌కు ఇది నాలుగో ఓటమి మాత్రమే. మొత్తం 18 మ్యాచుల్లో ఛేదనకు దిగిన హార్దిక్ నాయకత్వంలోని గుజరాత్ 14 మ్యాచుల్లో విజయం సాధించింది.
- చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ మతీషా పతిరణ డెత్ ఓవర్లలో మరోసారి అద్భుతమనిపించాడు. ఈ సీజన్‌లో మొత్తం 26.2 ఓవర్లు (డెత్ ఓవర్లు) వేసిన పతిరణ 16 వికెట్లు తీశాడు. ఇందులో 65 డాట్ బాల్స్ ఉండటం విశేషం.
- డెత్ ఓవర్లలో పతిరణ 16 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ 11 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ, రుతురాజ్‌ను మోహిత్ శర్మనే ఔట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్