VHT 2022: విజయ్‌ హజారే ట్రోఫీలో కోహ్లీ రికార్డుని సమం చేసిన నారాయణ్‌ జగదీశన్‌

విజయ్ హజారేలో ట్రోఫీలో ఒకే సీజన్‌లో అత్యధిక సెంచరీలు (4) చేసిన విరాట్ కోహ్లీ రికార్డును తమిళనాడు ఆటగాడు జగదీశన్‌  నారాయణ్‌ సమం చేశాడు. శుక్రవారం హరియాణాతో జరిగిన మ్యాచ్‌లో జగదీశన్‌ (128; 123 బంతుల్లో  6 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ బాదాడు.

Updated : 19 Nov 2022 23:47 IST

ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారేలో ట్రోఫీలో ఒకే సీజన్‌లో అత్యధిక సెంచరీలు (4) చేసిన విరాట్ కోహ్లీ రికార్డును తమిళనాడు ఆటగాడు జగదీశన్‌  నారాయణ్‌ సమం చేశాడు. శుక్రవారం హరియాణాతో జరిగిన మ్యాచ్‌లో జగదీశన్‌ (128; 123 బంతుల్లో  6 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ బాదాడు. 2008-09 సీజన్‌లో విరాట్‌ కోహ్లీ నాలుగు సెంచరీలు (102, 119*,124, 114) బాది మొత్తం 534 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో ఒకే సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, నారాయణ్‌ జగదీశన్‌తోపాటు రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ ఉన్నారు.  

ఈ మ్యాచ్‌లో నారాయణ్‌ జగదీశన్‌ మరో రికార్డును కూడా అందుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో కుమార సంగక్కర, అల్విరో పీటర్సన్‌, పడిక్కల్‌ తర్వాత నాలుగు సెంచరీలు బాదిన ఆటగాడిగా నిలిచాడు. జగదీశన్‌ ఇప్పటివరకు 41 లిస్ట్‌ -ఏ మ్యాచ్‌లు ఆడి 44.55 సగటుతో 1782 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 6 అర్ధ సెంచరీలున్నాయి. ఇక,  మ్యాచ్‌ విషయానికొస్తే.. నారాయణ్‌ జగదీశన్‌ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో హరియాణా 28.3 ఓవర్లలో 133 పరుగుకే ఆలౌటైంది. దీంతో తమిళనాడు 151 పరుగుల ఘన విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని