Vijay Shankar: విజయ్‌ శంకర్‌ను ఎలా తీసుకున్నారు..? గుజరాత్‌ ఆల్‌రౌండర్‌పై విపరీతమైన ట్రోలింగ్‌

గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. అతడిని ఈ టీ20 లీగ్‌కు ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు...

Published : 16 Apr 2022 01:50 IST

(Photo: Vijay Shankar Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. అతడిని ఈ టీ20 లీగ్‌కు ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. గతరాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా వచ్చి ఏడు బంతులాడి కేవలం రెండే పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో అతడిని ఎందుకు తీసుకుంటున్నారని అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు గుజరాత్‌ టీమ్‌ ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌ అనే ప్రతిభావంతుడైన యువకుడిని పక్కనపెట్టి విజయ్‌ను ఎంపిక చేయడంతో మరింత రెచ్చిపోతున్నారు.

విజయ్‌ కొన్నేళ్లుగా ఈ టీ20 లీగ్‌ ఆడుతూ వరుసగా విఫలమవుతున్నాడు. మధ్యలో టీమ్‌ఇండియాకు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేదు. ఇక ఈ లీగ్‌లోనూ ఎన్ని అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అతడి వల్ల 2019 వన్డే ప్రపంచకప్‌లో అంబటిరాయుడు చోటు కోల్పోయాడని, ఇప్పుడు సాయిసుదర్శన్‌ అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడని విమర్శలు చేస్తున్నారు. సాయి ఇటీవల పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో 35 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో అతడిని కాదని, విజయ్‌ను ఎలా తీసుకుంటున్నారని నిలదీస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన విజయ్‌ శంకర్‌ 6.33 సగటుతో కేవలం 19 పరుగులే చేశాడు.









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని