Vinod Kambli: మద్యం మత్తులో భార్యపై దాడి.. కాంబ్లీపై ఎఫ్‌ఐఆర్ నమోదు!
వినోద్ కాంబ్లీ (Vinod Kambli) ఆడిన మ్యాచ్‌లు తక్కువే. కానీ, అద్భుతమైన టీమ్‌ఇండియా (Team India) ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. కానీ, చెడు వ్యసనాలకు గురైన కాంబ్లీ తన కెరీర్‌ను నాశనం చేసుకొన్నాడు. ఇప్పుడు మళ్లీ తన దూకుడైన ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా తన భార్యపై దాడి చేసి వార్తల్లో నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) చిక్కుల్లో పడ్డాడు. తాజాగా అతడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంబ్లీ సతీమణి ఆండ్రియా (Andrea) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం గమనార్హం. తనను దుర్భాషలాడటంతోపాటు దాడికి పాల్పడినట్లు కాంబ్లీపై ఆండ్రియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబయి పోలీసులు (Mumbai Police) కాంబ్లీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఆండ్రియా తలకు గాయం కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో తనపై దాడి చేశాడని కాంబ్లీ భార్య ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు వినోద్ కాంబ్లీని అదుపులోకి తీసుకోలేదని పేర్కొన్నారు. అయితే, భార్యపై దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం జరిగినట్లు తెలుస్తోంది. ఫిర్యాదులో పేర్కొన్నదానిని బట్టి.. కుకింగ్ పాన్‌ను విసిరి కొట్టడంతో కాంబ్లీ భార్య తలకు దెబ్బ తగలిగిందని అధికారులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మద్యం తాగి వచ్చిన కాంబ్లీ విపరీతంగా దుర్భాషలాడుతూ ఆమెపై దాడి చేసినట్లు తెలిపారు. కాంబ్లీ భార్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 324, ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Apsara Murder Case: ఇంటర్నెట్లో శోధించి.. పథకం ప్రకారమే అప్సర హత్య
-
Sports News
WTC Final : అసలేం జరుగుతోంది..? సిరాజ్‌పై గావస్కర్ అసహనం..
-
Movies News
Ileana: ఆశను కోల్పోయిన వేళ.. నా కన్నీళ్లు తుడిచాడు: ప్రియుడి గురించి ఇలియానా తొలి పోస్ట్
-
Politics News
Revanth Reddy: కష్టపడి పని చేయాలి.. సర్వే ప్రాతిపదికనే టికెట్లు: రేవంత్ రెడ్డి
-
Crime News
Gold seized: నెల్లూరు, హైదరాబాద్‌లో 10.27 కిలోల బంగారం పట్టివేత
-
Politics News
Ajit Pawar: అజిత్ మళ్లీ పక్కకే.. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుప్రియా సూలే