MS DHONI : ఇంగ్లాండ్ పర్యటనలో బిజిబిజీగా ధోనీ.. విండీస్ దిగ్గజంతో మాజీ సారథి
ఇంగ్లాండ్‌లో టీమ్ఇండియాతో పాటు మరొక దిగ్గజం పర్యటన కొనసాగుతోంది. అతడే భారత మాజీ సారథి ఎంఎస్ ధోనీ. వింబుల్డన్ మ్యాచ్‌ను...
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌లో టీమ్ఇండియాతో పాటు మరొక దిగ్గజం పర్యటన కొనసాగుతోంది. అతడే భారత మాజీ సారథి ఎంఎస్ ధోనీ. వింబుల్డన్ మ్యాచ్‌ను వీక్షించడంతోపాటు ధోనీ బర్త్‌డే వేడుకలను కూడా లండన్‌లోనే చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా యువ ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ కనిపించిన ధోనీ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లోనూ మెరిశాడు. ధోనీతోపాటు విండీస్ దిగ్గజ ఓపెనర్ గార్డన్ గ్రీనిడ్జ్, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌తో కలిసి ఇంగ్లాండ్‌తో వన్డే మ్యాచ్‌ను వీక్షించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బుమ్రా (6/19) విజృంభణతో ఇంగ్లాండ్ 110 పరుగులకే కుప్పకూలింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (75*), శిఖర్ ధావన్ (31*) తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించారు. దీంతో భారత్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో టీమ్ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
PM-KISAN: పీఎం-కిసాన్ మొత్తం పెంపుపై కేంద్రం క్లారిటీ
-
Movies News
Social Look: సన్ఫ్లవర్స్తో అనసూయ రొమాన్స్.. రకుల్ డైమండ్ కొటేషన్!
-
World News
British Airlines: ఇంత మోసమా.. ఎంతో ఆశతో విండో సీట్ బుక్ చేస్తే..!
-
India News
PM Modi: అలా అనే ధైర్యం ఎవ్వరికీ లేదు : మోదీ
-
Sports News
Anil Kumble: భారత క్రికెట్లో ఈ రోజు ఓ సంచలనం.. కుంబ్లేకు పాక్ జట్టు దాసోహమైన వేళ!
-
General News
Andhra News: ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.4,42,442 కోట్లు: కేంద్రం