Virat Kohli: బంగ్లాతో మ్యాచ్‌లో ‘వాటర్‌బాయ్‌’గా కోహ్లీ.. ఫన్నీ రన్‌ చూశారా..?

IND vs BAN: టీమ్‌ఇండియా.. తన చివరి సూపర్‌ 4 మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడుతోంది. ఫైనల్‌కు ముందు జరుగుతున్న ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కోహ్లీ (Virat Kohli)కి విశ్రాంతినిచ్చారు. దీంతో అతడు వాటర్‌ బాయ్‌గా మారాడు.

Updated : 15 Sep 2023 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) మాజీ సారథి, పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) మైదానంలో ఎంత సరదాగా ఉంటాడో తెలిసిందే. ఫీల్డింగ్‌లో ఉన్నా.. డగౌట్‌లో కూర్చున్నా.. తన హుషారుతో తోటి ఆటగాళ్లలో జోష్‌ నింపుతుంటాడు. కొన్ని సార్లు తన హావభావాలతో నవ్వులు పూయిస్తుంటాడు. తాజాగా ఆసియా కప్‌లో బంగ్లాతో జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌ (IND vs BAN)లో కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. దీంతో ఈ స్టార్‌ బ్యాటర్‌ తన జట్టు ఆటగాళ్ల కోసం ‘వాటర్‌బాయ్‌ (Water Boy)’గా మారాడు.

బంగ్లా ఆటగాడు అనముల్‌ హక్‌ ఔటైన తర్వాత కోహ్లీ (Virat Kohli).. మైదానంలో ఉన్న తన సహచరులకు నీళ్ల బాటిళ్లు తీసుకెళ్లాడు. ఆ సమయంలో అతడు పరిగెత్తిన తీరు చాలా ఫన్నీగా ఉంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో విరాట్‌ కామెడీ టైమింగ్‌ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

ఆసియా కప్‌ అంటే చాలు.. శ్రీలంక దూకుడే వేరు..

ఇక, తాజా మ్యాచ్‌లో టీమ్‌ఇండియాకు మంచి ఆరంభం దక్కింది. భారత బౌలర్ల ధాటికి బంగ్లా జట్టు విలవిల్లాడుతోంది. మరోవైపు ఆసియా కప్‌లో ఇప్పటికే ఫైనల్‌ చేరిన టీమ్‌ఇండియా.. నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో పలు మార్పులు చేసింది. కోహ్లీతో పాటు హర్దిక్‌ పాండ్యా, సిరాజ్‌, బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌కు విశ్రాంతినిచ్చింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని