Ukrain Crisis: ఉక్రెయిన్‌ ఆటగాడికి మైదానంలో స్టాండింగ్‌ ఒవేషన్‌.. ప్లకార్డులతో మద్ధతు

ఉక్రెయిన్‌ ఆటగాడు రోమన్‌ యెరెమ్‌చుక్‌కు అభిమానుల నుంచి విశేష మద్ధతు లభించింది. మీకు తోడుగా మేమున్నామంటూ ప్లకార్డులు, చప్పట్లతో అభిమానులు......

Published : 28 Feb 2022 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌ ఆటగాడు రోమన్‌ యెరెమ్‌చుక్‌కు అభిమానుల నుంచి విశేష మద్ధతు లభించింది. మీకు తోడుగా మేమున్నామంటూ ప్లకార్డులు, చప్పట్లతో అభిమానులు ఆ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌కు మద్ధతుగా నిలిచారు. స్టేడియంలో అతడికి స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. పోర్చుగల్‌లో జరిగిన ప్రిమైరా లిగా ఫుట్‌బాల్‌ లీగ్‌లో బెన్‌ఫికా, విక్టోరియా ఎస్‌సీ జట్ల మధ్య మ్యాచ్‌ సందర్భంగా ఈ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.

బెన్‌ఫికా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న యెరెమ్‌చుక్‌.. ఈ మ్యాచ్‌లో మొదట ప్లేయింగ్‌ XIలో లేడు. కానీ 62వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగారు. అయితే అతడు మైదానంలోకి అడుగుపెట్టగానే అభిమానులు కరతాళధ్వనులతో స్వాగతం పలుకుతూ అతడిని స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు మద్ధతు తెలుపుతూ.. ప్లకార్లులు ప్రదర్శించారు. సంఘీభావం ప్రదర్శిస్తూ.. డిఫెండర్ జాన్ వెర్టోంగ్‌హెన్ కెప్టెన్ ఆర్మ్‌ బ్యాండ్‌ను రోమన్‌ చేతికి తొడిగాడు. దీంతో ప్రస్తుతం తన దేశంలోని పరిస్థితులను తలుచుకున్న యెరెమ్‌చుక్‌ భావోద్వేగానికి గురయ్యాడు. అభిమానులకు అభివాదం చేస్తూ కంటతడి పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బెన్‌ఫికా జట్టు ట్విటర్‌ వేదికగా పంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో బెన్‌ఫికా జట్టు 3-0 గోల్స్ తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని