T20 Rankings: కోహ్లీ, రాహుల్ ర్యాంకులు పడ్డాయ్.. ఆ జాబితాల్లో అయితే జాడే లేదు!

టీ20 ర్యాంకులను విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి

Updated : 27 Oct 2021 17:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తాజాగా ప్రకటించిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ (ICC T20 Rankings)లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), కేఎల్ రాహుల్‌ (KL Rahul) స్థానాలు పడిపోయాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన విరాట్‌ కోహ్లీ (725) ఐదో స్థానానికి చేరగా.. తొలి మ్యాచ్‌లో విఫలమైన కేఎల్‌ రాహుల్ (684) ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. బ్యాటర్ల టాప్ 10 (Top 10) జాబితాలో కేవలం ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్ అజామ్ (Babar Azam) రెండో స్థానానికి ఎగబాకాడు. టాప్‌లో ఉన్న డేవిడ్ మలన్‌ (Dawid Malan) (831) కంటే కేవలం పదకొండు పాయింట్లు మాత్రమే బాబర్ (820) వెనుకబడి ఉన్నాడు. మూడో స్థానాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్‌ మార్‌క్రమ్‌ (743) ఆక్రమించాడు. పాక్‌ వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ రిజ్వాన్ (727) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐదో స్థానంలో కోహ్లీ, ఆరో స్థానంలో ఫించ్‌ (720), ఏడో స్థానంలో డేవిడ్ కాన్వే (714), ఎనిమిదిలో కేఎల్ రాహుల్, తొమ్మిదిలో ఎవిన్ లూయిస్ (679), పదో స్థానంలో హజ్రతుల్లా (671) ఉన్నారు.

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకిబ్‌ అల్ హసన్‌ (295) ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్‌ స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో అఫ్గాన్‌ క్రికెటర్ మహమ్మద్‌ నబీ (275) ఉన్నాడు. ఇక బౌలర్ల జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు తబ్రైజ్ షంసి (750) మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక ప్లేయర్ వహిందు డిసిల్వా (726), రషీద్‌ ఖాన్‌ (720) ఉన్నారు. అయితే ఆల్‌రౌండర్లు, బౌలర్ల జాబితాలో ఒక్కరంటే ఒక్క భారతీయ క్రికెటర్‌ కూడా చోటు సంపాదించలేకపోవడం గమనార్హం. జట్లపరంగా చూస్తే.. తొలి మూడు స్థానాల్లో ఇంగ్లాండ్, భారత్‌, పాకిస్థాన్‌ ఉండగా.. న్యూజిలాండ్ (4), దక్షిణాఫ్రికా (5), ఆస్ట్రేలియా (6), అఫ్గానిస్థాన్‌ (7), బంగ్లాదేశ్‌ (8), శ్రీలంక (9), వెస్టిండీస్ (10) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని