ఆసీస్‌ కవ్వింపులకు కోహ్లీనే కరెక్ట్‌!

సిడ్నీ టెస్టులో కొందరు ఆస్ట్రేలియా అభిమానులు చేసిన అతి ప్రవర్తనను క్రికెట్‌ ప్రపంచం తీవ్రంగా విమర్శిస్తోంది. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ఉద్దేశిస్తూ కొందరు ఆకతాయిలు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన......

Updated : 11 Jan 2021 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సిడ్నీ టెస్టులో కొందరు ఆస్ట్రేలియా అభిమానులు చేసిన అతి ప్రవర్తనను క్రికెట్‌ ప్రపంచం తీవ్రంగా విమర్శిస్తోంది. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ఉద్దేశిస్తూ కొందరు ఆకతాయిలు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించే భారత క్రికెటర్లపై ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని క్రికెటర్లు, నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు డిమాండ్ చేస్తున్నారు.

సిరాజ్‌కు ఎదురైన అవాంఛనీయ సంఘటన నేపథ్యంలో.. గతంలో ఆసీస్‌ క్రికెటర్లకు భారత ఆటగాళ్లు ఎన్నో సార్లు అండగా నిలిచారని గుర్తుచేస్తూ నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌ భారత్‌×ఆసీస్‌ మ్యాచ్‌లో స్మిత్‌కు కోహ్లీ మద్దతు నిలిచిన విషయం తెలిసిందే. ‘చీటర్‌.. చీటర్’ అంటూ స్మిత్‌ను అభిమానులు గేలి చేసిన సందర్భంలో కోహ్లీ అండగా నిలిచాడు. దీనికి సంబంధించిన పోస్ట్‌లు ట్వీట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో సిరాజ్‌ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి వీడియోను షేర్‌ చేస్తున్నారు. ఆల్‌రౌండర్‌ గ్రీన్ బంతి తగిలి గాయపడగా.. క్రీజులో ఉన్న సిరాజ్‌ పరుగుకు ప్రయత్నించకుంగా గ్రీన్‌ వైపు పరిగెత్తిన సంగతి గుర్తుచేస్తున్నారు. అలాంటి భారత ఆటగాళ్లకు తిరిగి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.

మరోవైపు మైదానంలో దూకుడుగా ఉండే కోహ్లీనే ఆస్ట్రేలియా కవ్వింపులకు సరైనోడని ట్వీట్‌లు చేస్తున్నారు. కోహ్లీ ఉంటే సిడ్నీ మైదానంలో వాతావరణం వేరుగా ఉండేదంటున్నారు. గతంలో రెచ్చగొట్టిన ప్రేక్షకులకు కోహ్లీ తనదైన శైలిలో సమాధానమిచ్చిన ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. 2011-12 పర్యటనలో కవ్విస్తున్న వీక్షకులకు వేలు చూపించిన ఫోటో, భారత బౌలర్లు వికెట్లు పడగొట్టిన సమయంలో గర్జిస్తూ సంబరాలు చేస్తున్న విరాట్‌ వీడియోలు నెట్టింట్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఇదీ చదవండి..

రౌడీల్లా ప్రవర్తించారు: కోహ్లీ

హద్దులు దాటారు.. ఉక్కు పిడికిలి బిగించాల్సిందే







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు