Virat - Anushka: మా ఇద్దరిలో విరాట్‌ డ్యాన్స్‌ అదరగొడతాడు: అనుష్క

స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ డాన్స్‌ మూవ్స్‌ అతడి అభిమానులకు సుపరిచితమే. అయితే తనకంటే విరాట్‌ డాన్స్‌ అదరగొడతాడని అతడి సతీమణి అనుష్కశర్మ వెల్లడించింది.

Published : 27 Mar 2023 19:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) డ్యాన్స్‌ అదరగొడతాడని ఆయన సతీమణి అనుష్కశర్మ (Anushka Sharma) వెల్లడించింది. ఇటీవల ముంబయిలో జరిగిన ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఆనర్స్‌ (Indian sports Honours Awards 2023) కార్యక్రమంలో పాల్గొన్నారు విరాట్‌, అనుష్క. ఆ కార్యక్రమంలో వారిద్దరూ ఆసక్తికర రాపిడ్‌ఫైర్‌ను ఎదుర్కొన్నారు. డ్యాన్స్‌ ఫ్లోర్‌పై ఎవరి ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ప్రశ్నించగా విరాట్‌ను చూపించింది అనుష్క. ఆమె సమాధానానికి కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ‘నేను డ్యాన్స్‌ బాగా చేస్తానా?’ అని అడిగాడు. దానికి ఆమె అవునని చెప్పింది. ఈ సందర్భంగా తన పాత రోజులను గుర్తుచేసుకున్నాడు విరాట్‌. ‘ఏదైనా పార్టీకి వెళ్లాక మద్యం సేవిస్తే (గతంలో) డ్యాన్స్‌ చేస్తాను. కానీ పార్టీకి హాజరైన వారు నేను అక్కడ ఉండాలని కోరుకోరు. దాన్ని నేను పట్టించుకోను. ఇకపై మాత్రం తాగను’’ అని తెలిపాడు. నార్వేకు చెందిన అబ్బాయిల డ్యాన్స్‌ గ్రూప్‌ ‘క్విక్‌స్టైల్‌’తో ఇటీవల విరాట్‌ బ్యాట్‌ పట్టి చేసిన డ్యాన్స్‌ నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

కోహ్లీ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. ఐపీఎల్ 2023 సందర్భంగా అతడు  సన్నద్ధమవుతున్నాడు.  ఫ్రాంఛైజీ ఆదివారం ఆర్సీబీ అన్‌బాక్స్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. అక్కడ వారు తమ కొత్త జెర్సీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్సీబీ మాజీ ఆటగాళ్లు క్రిస్‌ గేల్‌, ఏబీ డెవిలియర్స్‌ సందడి చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్‌ 2న ముంబయిఇండియన్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలి మ్యాచ్‌ ఆడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని