Virat Kohli Yo - Yo Test: విరాట్ ఫిట్‌నెస్‌ అదుర్స్.. యో-యో టెస్టు స్కోరు ఎంతంటే?

ప్రస్తుత తరం భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫిట్‌నెస్‌ మరెవరికీ ఉండదంటే అతిశయోక్తి కాదు. తాజాగా యో-యో టెస్టులోనూ అత్యుత్తమ స్కోరు సాధించాడు. తన సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు.

Published : 24 Aug 2023 15:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్ (Asia Cup 2023) కోసం సిద్ధమవుతున్న టీమ్‌ఇండియా (Team India) స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ యో-యో టెస్టులోనూ పాస్‌ అయిపోయాడు. ఒకప్పుడు జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే యో-యో టెస్టులో (Yo Yo Test) బీసీసీఐ నిర్దేశించిన స్కోరును తప్పినిసరిగా సాధించాల్సిందే. కానీ, ప్రస్తుతం ఈ టెస్టును ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఈ టెస్టులు మరీ కఠినంగా ఉన్నాయనే విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. అయితే, ఫిట్‌నెస్‌ విషయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఎంతో కఠినంగా ఉంటాడు. అందుకే మైదానంలో చిరుతలా కదులుతుంటాడని చెబుతుంటారు. తాజాగా తన యో-యో టెస్టు ఫలితాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ టెస్టులో తన స్కోరు 17.2గా వచ్చినట్లు విరాట్ పేర్కొన్నాడు. బీసీసీఐ కనీసం 16.5 పాయింట్లు రావాలని ఆటగాళ్లకు చెబుతోంది.

తెల్లపావులతో ఆడిన కార్ల్‌సన్‌ను నియంత్రించడం చాలా కష్టం.. ప్రజ్ఞానంద అద్భుతం

మినీ టోర్నీ సన్నద్ధత కోసం ఇప్పటికే బెంగళూరులోని క్యాంప్‌నకు ఎంపికైన ఆటగాళ్లు చేరుకున్నారు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లు మినహా మిగతా వారంతా జాతీయ క్రికెట్ అకాడమీకి (NCA) వచ్చారు. వారూ శుక్రవారం నాటికి జట్టుతో కలుస్తారని బీసీసీఐ పేర్కొంది. ఈ శిబిరంలో కోచింగ్‌ సిబ్బందితోపాటు ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. ఆగస్ట 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్2న టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. రోహిత్ నాయకత్వంలోని జట్టులోకి హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ వచ్చాడు. గాయాల కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌కు జట్టులో స్థానం దక్కింది. సంజూ శాంసన్‌ను స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేయడం గమనార్హం.

భారత జట్టు ఇదే: 

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్‌ కిషన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, బుమ్రా, షమీ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని