Virat - Shah rukh Fans: విరాట్ - షారుక్ ఖాన్ ఫ్యాన్స్ ట్విటర్ వార్.. ఓ యూజర్ సూపర్ ట్వీట్
సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. తమ అభిమాన ఆటగాడినైనా, నటుడినైనా ఒక్క మాట అంటే చాలు.. నెట్టింట్లో ఒక్కసారిగా అభిమానులు హల్‌చల్ చేసేస్తారు. నానారాద్ధాంతం చేసి మరీ ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు.
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమాల ట్రెండ్ మొదలయ్యాక సామాన్యుడు తన అభిప్రాయాలను నిరభ్యంతరంగా వెల్లడిస్తున్నాడు. అలాగే, తమకు నచ్చని వాటిపైనా స్పందించడానికి వాటిని వేదికలుగా మార్చేసుకుంటున్నారు. కొందరేమో హుందాగా తమ అభిప్రాయాలను చెబుతుంటే.. మరికొందరు అసభ్యపదజాలంతో విరుచుకుపడుతూ విమర్శలకు గురవుతున్నారు. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ప్రారంభం కానున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఓ చర్చ జరిగింది. ఇప్పుడిదే ఇద్దరు స్టార్ల అభిమానుల మధ్య వాదోపవాదాలకు కారణమైంది.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్.. వీరిద్దరిలో ఎవరిది గొప్ప వ్యక్తిత్వం..? అంతర్జాతీయంగా ఎచీవర్ ఎవరు? అనే విషయాలపై రెండు రోజుల కిందట ఓ ట్విటర్ యూజర్ పోలింగ్ నిర్వహించాడు. ఎక్కువ మంది విరాట్ కోహ్లీ (54.4 శాతం) వైపు మొగ్గు చూపగా.. షారుఖ్ ఖాన్‌కు 45.6 శాతం మంది మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో విరాట్, షారుఖ్ అభిమానుల మధ్య చర్చ జరిగింది. కొందరేమో కోహ్లీ గ్రేట్ అంటూ పోస్టులు పెట్టగా.. మరికొందరు షారుక్‌కు అంతర్జాతీయంగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారని బలనిరూపణకు దిగారు. అయితే ఓ ట్విటర్ యూజర్ మాత్రం అద్భుతమైన ట్వీట్‌తో ఆకట్టుకున్నాడు. గత టీ20 ప్రపంచకప్‌లో విరాట్ సూపర్ ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్‌పై భారత్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కోహ్లీని షారుక్ ఖాన్ అభినందించాడు. ఆ ట్వీట్‌ను షేర్ చేసిన సదరు యూజర్ వారిద్దరూ (విరాట్, షారుక్) గొప్పవారేనని పోస్టు పెట్టాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ
-
Ts-top-news News
రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/2023)
-
Sports News
ఆ బౌలర్ అరంగేట్రం.. అతడికి జాక్‌పాట్