Virat Kohli: డుప్లెసిస్‌.. ఇకపై ఫీల్డింగ్‌ చేసేటప్పుడు నన్ను రింగ్‌లోనే ఉంచు: కోహ్లీ

బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన సారథి ఫా డుప్లెసిస్‌ను విచిత్రమైన కోరిక కోరాడు. ఇకపై ఆ జట్టు ఆడే మ్యాచ్‌ల్లో తనని ఫీల్డింగ్‌లో 30 గజాల సర్కి్‌ల్‌లోనే ఉంచాలన్నాడు...

Updated : 07 Dec 2022 14:42 IST

దిల్లీపై గెలుపు.. బెంగళూరు విజయ సంబురాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన సారథి ఫా డుప్లెసిస్‌ను విచిత్రమైన కోరిక కోరాడు. ఇకపై ఆ జట్టు ఆడే మ్యాచ్‌ల్లో తనని ఫీల్డింగ్‌లో 30 గజాల సర్కి్‌ల్‌లోనే ఉంచాలన్నాడు. శనివారం రాత్రి దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 16 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం బెంగళూరు జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో సంబరాలు చేసుకుంటున్న సమయంలో కోహ్లీ ఇలా కోరాడు.

ఈ మ్యాచ్‌లో 190 పరుగుల ఛేదనలో దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (34; 17 బంతుల్లో 3x4, 2x6) ధాటిగా ఆడుతూ బెంగళూరు నుంచి మ్యాచ్‌ లాగేసుకునేలా కనిపించాడు. అయితే, సిరాజ్ వేసిన 16.3 ఓవర్‌కు అతడు ఔటయ్యాడు. అప్పుడు సర్కిల్‌లోనే కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లీ తల మీదుగా బౌండరీ కొడదామని భావించి పంత్‌ షాట్‌ ఆడాడు. అది గాల్లో దూసుకుపోతుండగా కోహ్లీ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో పంత్‌ ఔటయ్యాక దిల్లీ లక్ష్యం దిశగా సాగలేదు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుదామని భావించి డుప్లెసిస్‌ను తనని అక్కడే ఫీల్డింగ్‌ పెట్టాలని సరదాగా కోరాడు.

అదే వీడియోలో కోహ్లీ.. తన మిత్రుడు, మాజీ సహచర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ను గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో డివిలియర్స్‌ ఒక్కడే చేసే పనిని ఇప్పుడు తాము ఇద్దరు, ముగ్గురు చేస్తున్నామన్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో తాను పట్టిన క్యాచ్‌తో పాటు దినేశ్‌ కార్తీక్‌ (66 నాటౌట్‌; 34 బంతుల్లో 5x3, 5x6) ఇన్నింగ్స్‌ కూడా డివిలియర్స్‌కు అంకితమిస్తున్నామని తెలిపాడు. అనంతరం కార్తీక్‌ మాట్లాడుతూ వాంఖడేలో అభిమానులు తనని డీకే డీకే అని సంబోధిస్తూ అరవడం సంతోషంగా ఉందన్నాడు. కాగా, మీరూ ఆ బెంగళూరు ఆటగాళ్లు ఎలా సంబరాలు చేసుకున్నారో ఈ కింద వీడియోలో చూడండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు