IND vs NZ: రికీ పాంటింగ్‌ రికార్డుపై కన్నేసిన కోహ్లి.!

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. కెప్టెన్‌గా ఒక్క శతకం సాధిస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ను అధిగమించనున్నాడు. ప్రస్తుతం కోహ్లి.. పాంటింగ్‌తో సమానంగా..

Published : 02 Dec 2021 22:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. కెప్టెన్‌గా ఒక్క శతకం సాధిస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ను అధిగమించనున్నాడు. ప్రస్తుతం కోహ్లి.. పాంటింగ్‌తో సమానంగా కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా పాంటింగ్‌ 41 శతకాలు నమోదు చేయగా.. కోహ్లి కూడా అన్నే సెంచరీలు బాదాడు. ముంబయిలో జరగనున్న రెండో టెస్టులో విరాట్‌ ఒక్క సెంచరీ నమోదు చేస్తే.. కెప్టెన్‌గా అత్యధిక శతకాలు (42) చేసిన ఏకైక ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 70 శతకాలు నమోదు చేశాడు. వీటిలో కెప్టెన్‌గా చేసిన సెంచరీలే 41 ఉండటం గమనార్హం.

* అశ్విన్‌ మరో ఆరు వికెట్లు తీస్తే..

మరోవైపు, కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ (417 వికెట్లు) రికార్డును రవిచంద్రన్‌ అశ్విన్ (419 వికెట్లు) బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా అతడు మరో రికార్డుపై కన్నేశాడు. ఇంకో ఆరు వికెట్లు తీస్తే.. ఓ క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సార్లు 50 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. అశ్విన్‌ ఇంతకు ముందు 2015, 2016, 2017 సంవత్సరాల్లో 50కి పైగా వికెట్లు తీశాడు. గతంలో టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్లు హర్భజన్ సింగ్‌, అనిల్ కుంబ్లేలు కూడా ఓ క్యాలెండర్ ఇయర్‌లో మూడు సార్లు 50కి పైగా వికెట్లు పడగొట్టారు. రెండో టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు తీస్తే.. వీరిద్దరినీ అధిగమించనున్నాడు.

 

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని