IND vs NZ: కెప్టెన్‌గా కోహ్లి ఖాతాలో అరుదైన ఘనత.!

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించడంతో.. అంతర్జాతీయ..

Published : 06 Dec 2021 18:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించడంతో.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌ చరిత్రలో 50 విజయాలు నమోదు చేసిన మొదటి కెప్టెన్‌గా ఘనత సాధించాడు. విరాట్ సాధించిన ఈ అరుదైన రికార్డుపై బీసీసీఐ స్పందిస్తూ.. అతడికి అభినందనలు తెలిపింది. ఇదిలా ఉండగా, కోహ్లి సారథ్యంలో టీమ్‌ఇండియా 153 వన్డే, 59 టీ20 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇటీవల కోహ్లి టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే.

రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1-0 తేడాతో సొంతం చేసుకోవడంతో.. స్వదేశంలో భారత్ వరుసగా 14వ టెస్టు సిరీస్‌లో విజయం సాధించినట్లయింది. ఈ మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘టీమ్‌ఇండియా మరోసారి గొప్ప ప్రదర్శన చేసింది. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధిస్తాం. జట్టు సభ్యులు మెరుగ్గా రాణించారు. తొలి టెస్టులో కూడా విజయం కోసం ఆఖరి వరకు పోరాడారు’ అని అన్నాడు. కాన్పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టుకు దూరంగా విరాట్ కోహ్లి.. రెండో టెస్టుకి అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని