Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. ఈ సారి మైదానంలో కాదు.. ఇన్‌స్టాలో

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ క్రికెట్‌లో అనేక రికార్డులను బద్ధలు కొట్టి కొత్త రికార్డులను నెలకొల్పాడు. మైదానంలో ఎప్పుడూ చురుకుగా ఉండే పరుగుల రారాజు సామాజిక మాధ్యమాల్లోనూ పుల్‌ యాక్టివ్‌గా ఉంటాడు.

Published : 09 Jun 2022 01:14 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ.. అనేక రికార్డులు బద్ధలు కొట్టి కొత్త రికార్డులను నెలకొల్పాడు. మైదానంలో ఎప్పుడూ చురుకుగా ఉండే పరుగుల రారాజు సామాజిక మాధ్యమాల్లోనూ పుల్‌ యాక్టివ్‌గా ఉంటాడు. తరుచూ మ్యాచ్‌లకు సంబంధించిన ఫొటోలతోపాటు జిమ్‌ చేస్తున్న వీడియోలను పోస్ట్‌ చేస్తుంటాడు. అప్పుడప్పుడు తన సతీమణి అనుష్క శర్మతో కలిసి వంట చేసిన వీడియోలతోపాటు ఇద్దరూ కలిసి పర్యాటక ప్రదేశాలకు వెళ్లి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటాడు. ఈ విధంగా సోషల్‌ మీడియాలో కోహ్లీకి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రీడాకారుల్లో లియోనల్‌ మెస్సీ(451 మిలియన్లు), క్రిస్టియానో రొనాల్డో (334 మిలియన్లు) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

తాజాగా ఇన్‌స్టాలో విరాట్‌ ఓ అరుదైన ఘనత అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 200 మిలియన్ల (20 కోట్లు) ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడిగా నిలిచాడు. ఈ సందర్భంగా ‘200 మిలియన్‌ స్ట్రాంగ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మద్దతు ఇస్తోన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌తో కోహ్లీ కెరీర్‌లో సాధించిన మైలురాళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకున్నాడు. ఇదిలా ఉండగా, భారత్, సౌతాఫ్రికా మధ్య జూన్‌ 9 నుంచి ప్రారంభంకానున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు గత కొన్నాళ్లుగా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లీ, రోహిత్, బుమ్రా, షమిలకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని