Covid relief:రంగంలోకి దిగిన విరాట్ కోహ్లి

బయో బుడగలో ఉన్న ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా సోకుతుండటంతో బీసీసీఐ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో ఆటగాళ్లు తమ స్వగృహాలకు చేరుకుంటున్నారు.

Published : 06 May 2021 23:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బయో బుడగలో ఉన్న ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా సోకుతుండటంతో బీసీసీఐ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో ఆటగాళ్లు తమ స్వగృహాలకు చేరుకుంటున్నారు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ముంబయి చేరుకున్నాడు. నిత్యం లక్షల సంఖ్యలో కేసులు వస్తుండటంతో దేశంలో  ఉన్న వైద్యపరమైన మౌలిక సదుపాయాలు చాలా మంది బాధితులకు సరిపోవడం లేదు.  దీన్ని దృష్టిలో ఉంచుకుని విరుష్క జోడీ కరోనా బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చింది.

‘కరోనా బాధితులకు సాయం చేసేందుకు విరాట్ కోహ్లి, నేను తర్వలోనే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. దీంట్లో మీరు (అభిమానులు)  కూడా భాగస్వాములు కావచ్చు’ అని కోహ్లి సతీమణి అనుష్క శర్మ  తన పుట్టిన రోజు(మే1) మరుసటి రోజున ఓ వీడియోని పోస్ట్‌ చేసింది.


ప్రస్తుతం ముంబయిలో ఉన్న విరాట్.. కరోనా బాధితులకు అందించాల్సిన సాయంపై  కసరత్తు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా  పలువురితో సంప్రదింపులు జరుపుతున్నాడు. శివసేన పార్టీ యువజన విభాగమైన యువసేన సభ్యుడు రాహుల్ ఎన్  కనాల్‌.. విరాట్ కోహ్లిని కలిశాడు.

‘మా కెప్టెన్‌ను కలిశాను. కరోనా బాధితులకు సాయం అందించడానికి అతను ఉద్యమం ప్రారంభించడం అభినందనీయం. విరాట్ చేస్తున్న కృషి గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు’ అని రాహుల్ ఎన్ కనాల్ విరాట్‌తో ఉన్న ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేశాడు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని