Virat Kohli - Rohit Sharma: రోహిత్‌ @ 35.. విరాట్‌ కోహ్లీ స్పెషల్‌ విషెస్‌

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈరోజు హిట్‌మ్యాన్‌ 35వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అతడికి ముంబయి...

Published : 30 Apr 2022 15:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈరోజు హిట్‌మ్యాన్‌ 35వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ముంబయి జట్టు, సహచరులు, మాజీలు, అభిమానులు, ఇతర ఫ్రాంఛైజీల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కోహ్లీ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రోహిత్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు. తాము ఇద్దరు కలిసున్న ఫొటో పంచుకొని ‘హ్యాపీ బర్త్‌డే రోహిత్‌.. గాడ్‌ బ్లెస్‌ యూ’ అని పోస్టు చేశాడు. కాగా, వీరిద్దరూ ప్రస్తుతం జరుగుతోన్న మెగా టోర్నీలో పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ముంబయి కెప్టెన్‌గా రోహిత్‌ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 19.13 సగటుతో 153 పరుగులు చేయగా.. బెంగళూరు బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ 9 మ్యాచ్‌ల్లో 16 సగటుతో 128 పరుగులే చేశాడు. దీంతో వీరిద్దరి ఫామ్‌పైన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే పుంజుకొని మళ్లీ రాణించాలని ఆశిస్తున్నారు.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని