Virat Kohli: విరాట్ @ 2006.. వైరల్‌గా మారిన వీడియో!
విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇప్పుడెంత స్టైలిష్‌గా ఉంటాడో.. టీనేజర్‌గానూ అదే యాటిట్యూడ్‌తో ఉండటం విశేషం. 17 ఏళ్ల కిందట వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final 2023) మ్యాచ్ ఆడుతున్నాడు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విరాట్ 2008 అండర్ -19 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత టీమ్‌ఇండియా, ఐపీఎల్‌లోకి అడుగు పెట్టి తన సత్తా ఏంటో చాటుతున్నాడు. ఈ క్రమంలో విరాట్‌కు సంబంధించిన అరుదైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2006లో విరాట్ కోహ్లీకి 17 ఏళ్ల వయసు ఉంటుంది. అప్పటికే దేశవాళీ క్రికెట్ ఆడుతున్న కోహ్లీ తన ఫ్రెండ్స్‌తో కలిసి బయటకొచ్చాడు. దీంతో తన స్నేహితుడొకరు ఫొటోకు పోజు ఇవ్వమని విరాట్ తలను కదిలిస్తూ అంటాడు. అయితే, అతడిపై చిరుకోపం ప్రదర్శించిన కోహ్లీ తన హెయిర్‌స్టైల్‌ను సరి చేసుకుంటూ ఫొటోలు దిగుతాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..
‘‘2006లోని విరాట్‌ను చూసిన తర్వాత.. ఇతడిని అనుష్క శర్మ వివాహం చేసుకుందంటే నమ్మలేకపోతున్నా’’
‘‘అప్పుడు విరాట్ ఇలాగుంటే.. అనుష్క శర్మ 2008లో తొలి సినిమా వచ్చింది. అంటే, 2006/2007 సమయంలో షూటింగ్ జరిగి ఉంటుంది’’
‘‘హలో గయ్స్.. మన చీకూ (విరాట్) ఎలాంటి లుక్‌లో ఉన్నాడో చూడండి’’
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Team India: కప్పు ముందు కనువిప్పు.. టీమ్ఇండియాకు ఓటమి నేర్పే పాఠాలెన్నో
-
GHMC: హైదరాబాద్‌లో భారీ వర్షం.. నాలాలో పడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్యకార్మికురాలి మృతి
-
Vijay Antony: కుమార్తె లేదన్న దుఃఖాన్ని దిగమింగుకుని.. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని!
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు