SKY: ఏ గ్రహం మీదైనా బ్యాటింగ్‌ చేయగలడు.. సూర్యపై సీనియర్ల ప్రశంసలు

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మిస్టర్‌ 360 సెంచరీపై సీనియర్‌ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 22 Nov 2022 12:58 IST

మౌంట్‌ మాంగనుయ్‌: న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో సూర్యకుమార్‌ అజేయ ఇన్నింగ్స్‌ (111*: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. తన ఆటతో జట్టును భారీ స్కోరు వైపు నడిపించిన సూర్య టీమ్‌ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. రోహిత్‌ శర్మ తర్వాత ఈ ఏడాది టీ20ల్లో రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా ఈ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ నిలిచాడు. ఈ ఆటగాడి ప్రతిభను సీనియర్‌ క్రికెటర్లు ప్రశంసించారు. మిస్టర్‌ 360 సెంచరీపై సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ కోహ్లీ ట్వీట్‌ చేస్తూ ఈ మ్యాచ్‌ను లైవ్‌లో చూడలేకపోయానని తెలిపాడు. ఈ అసాధారణ ఆటగాడు కచ్చితంగా మరో వీడియో గేమ్‌ను పోలిన షాట్లతో విరుచుకుపడి ఉంటాడంటూ కొనియాడాడు. మరికొందరు సీనియర్లు సైతం తమ సంతోషాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. 

‘‘అతడు ప్రపంచంలోనే ఉత్తమమైన ఆటగాడు ఎందుకయ్యాడో తన ప్రదర్శనతో నిరూపిస్తున్నాడు. మ్యాచ్‌ను చూడలేదు. కానీ కచ్చితంగా అది మరో వీడియో గేమ్‌లాంటి ప్రదర్శనే అయ్యుంటుంది’’  -విరాట్‌ కోహ్లీ 

‘‘ఈ మధ్యన సూర్యుడు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు’’  -వీరేంద్ర సెహ్వాగ్‌

‘‘సూర్య.. ఏ గ్రహం మీదైనా బ్యాటింగ్ చేయగలడు’’  -ఇర్ఫాన్‌ పఠాన్‌







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని