గావస్కర్ రికార్డుపై కోహ్లీ గురి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌పై సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలవడానికి 489 పరుగుల....
ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌పై సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలవడానికి 489 పరుగుల దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఆ రికార్డు దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ పేరిట ఉంది. గావస్కర్ 22 టెస్టుల్లో 1331 పరుగులు చేశాడు. కాగా, కోహ్లీ 9 టెస్టుల్లో 843 పరుగులు సాధించాడు.
స్వదేశంలో ఇంగ్లాండ్‌పై ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ముందు స్థానాల్లో గావస్కర్, గుండప్ప విశ్వనాథ్ (1022 పరుగులు, 17 టెస్టులు), సచిన్ తెందుల్కర్ (960 పరుగులు, 15 మ్యాచ్‌లు), విజయ్ మంజ్రేకర్ (843 పరుగులు, 10 మ్యాచ్‌లు) ఉన్నారు. విరాట్ తర్వాతి స్థానంలో చెతేశ్వర్ పుజారా ఉన్నాడు. నయావాల్ 9 మ్యాచ్‌ల్లో 839 పరుగులు చేశాడు.
అయితే పితృత్వ సెలవులు ముగించుకుని తిరిగి జట్టులో చేరడం, టెస్టుల్లో శతకం సాధించక దాదాపు 13 నెలలు కావడంతో.. ఇంగ్లాండ్ సిరీస్‌లో కోహ్లీ చెలరేగుతాడని భావిస్తున్నారంతా. అంతేగాక ఇంగ్లాండ్‌తో జరిగిన గత రెండు సిరీస్‌ల్లోనూ కోహ్లీ పరుగుల మోత మోగించాడు. స్వదేశంలో జరిగిన 2016-17 సిరీస్‌లో అయిదు టెస్టుల్లో వందకు పైగా సగటుతో 655 పరుగులు చేశాడు. ఇక 2018 ఇంగ్లాండ్ పర్యటనలోనూ అయిదు టెస్టుల్లో 593 పరుగులు సాధించాడు.
రికీ రికార్డుకు శతకం దూరంలో..
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ సాధించిన ఓ రికార్డుకు కూడా కోహ్లీ అతిదగ్గరిలో ఉన్నాడు. స్వదేశంలో అత్యధిక శతకాలు సాధించిన టెస్టు కెప్టెన్‌గా రికీ రికార్డు సాధించాడు. అతడు 39 మ్యాచ్‌ల్లో 11 శతకాలు సాధించాడు. కాగా, కోహ్లీ సారథిగా 26 టెస్టుల్లో 10 సెంచరీలు చేశాడు. మరో శతకం సాధిస్తే పాంటింగ్ సరసన నిలుస్తాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి