
Virat Kohli: టీ20 లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ విరాట్ కోహ్లీ
ఇంటర్నెట్‌డెస్క్: బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ భారత టీ20 లీగ్‌లో అరుదైన ఘనత సాధించాడు. గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్పీత్‌బ్రార్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే సింగిల్ తీసిన అతడు.. ఈ టీ20 లీగ్‌లో 6,500 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. దీంతో ఈ రికార్డు నెలకొల్పిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ సీజన్లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న అతడు ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 20 పరుగులు చేసిన కోహ్లీ 3.2 ఓవర్‌కు రబాడ బౌలింగ్‌లో రాహుల్ చాహర్ చేతికి చిక్కి ఔటయ్యాడు. దీంతో అతడి నుంచి మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది.
ఇక విరాట్ ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తం 13 మ్యాచ్‌లు ఆడగా 19.67 సగటుతో 236 పరుగులే చేశాడు. ఈ లీగ్ మొత్తంలో చూస్తే 220 మ్యాచ్‌ల్లో 16.22 సగటుతో 6,519 పరుగులు చేసి అందరికన్నా ముందున్నాడు. అందులో ఐదు సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలు సాధించాడు. తర్వాత శిఖర్ ధావన్ 204 మ్యాచ్‌ల్లో 35.15 సగటుతో 6,186 పరుగులు చేశాడు. వీరిద్దరే ప్రస్తుతం 6 వేల పరుగులకుపైగా కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (5,876), రోహిత్ శర్మ (5,829), సురేశ్ రైనా (5,528) నిలిచారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ ఫైట్.. వీఎఫ్ఎక్స్ కథ ఇదీ!
-
Sports News
Team India: పుజారాను డకౌట్ చేసిన షమి.. తర్వాత ఏం చేశాడో చూడండి..!
-
Related-stories News
Crime News: గుడిలో నాలుక కోసేసుకున్న భక్తురాలు
-
Related-stories News
Mouse Deer: మూషిక జింక.. బతికేందుకు తంటా
-
Ts-top-news News
Drones: మనుషుల్ని మోసుకెళ్లే డ్రోన్లు.. గమ్యానికి తీసుకెళ్లే సైకిళ్లు!
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- IND vs LEIC Practice Match : భళా అనిపించిన భారత బౌలర్లు.. మెరిసిన పంత్
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!