Virat Kohli: అతడి బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డ కోహ్లీ..!

సూపర్‌ 8 మ్యాచ్‌ల నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

Published : 19 Jun 2024 17:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ.. టీ20 ప్రపంచకప్‌ లీగ్‌ దశలో పెద్దగా ఆకట్టుకోలేదు. ఆడిన మూడింట్లో సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితం కాగా.. అందులో ఒక డకౌట్‌ ఉంది. దీంతో సూపర్‌ 8 దశలో మెరుగ్గా రాణించేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకు తగ్గట్లే నెట్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 

అఫ్గాన్‌తో తొలి సూపర్‌ 8 మ్యాచ్‌ నేపథ్యంలో కోహ్లీ నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపాడు. అయితే.. రిజర్వ్‌ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో అతడు కాస్త ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. కుల్‌దీప్‌ బౌలింగ్‌లో బాగానే ఆడినప్పటికీ.. ఖలీల్‌ బంతులు కొన్ని మిస్‌ కావడంతో అతడు నిరాశకు గురైనట్లు సమాచారం. మరోవైపు సూపర్‌ 8 దశలో కోహ్లీ కీలకంగా మారి గొప్పగా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

విండీస్‌ దిగ్గజం నుంచి ప్రశంసలు.. 

తాను ఎంతో మంది గొప్ప బ్యాటర్లను చూశానని.. ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ ఆటగాళ్లలో విరాట్‌ ముందుంటాడని వెస్టిండీస్‌ దిగ్గజం వెస్లీ హాల్‌  కొనియాడాడు. కింగ్‌స్టన్‌ ఓవల్‌లో టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో హాల్‌ అక్కడికి వచ్చాడు. తన ఆటోబయోగ్రఫీని కోహ్లీ, రోహిత్‌ శర్మ, హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌లకు అందించాడు. అనంతరం కోహ్లీతో ముచ్చటించాడు.

‘‘ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను చూశాను. అందులో నువ్వు ఒకరివి. నీ కెరీర్‌ను నేను గమనిస్తున్నాను. భారత్‌కు ఇంకా చాలా సంవత్సరాలు ఆడతావు’’ అంటూ విరాట్‌పై హాల్‌ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌పైనా తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఈ ఖరీదైన లీగ్‌ అందించే సొమ్మును తిరస్కరించడం ఆటగాళ్లకు చాలా కష్టమని పేర్కొన్నాడు. క్రికెట్‌లో ఎన్నో మార్పులు వచ్చాయని.. బ్యాటర్లకు అనుకూలంగా ఆట మారడం తనకు నచ్చలేదన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని