
Virat : రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మను అధిగమించిన విరాట్ కోహ్లీ
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మను ఓ విషయంలో విరాట్ కోహ్లీ అధిగమించేశాడు. ఇదేదో మంచి రికార్డు అనుకోకండి. ఈ లిస్ట్‌లోకి చేరకూడదని బ్యాటర్లు భావిస్తుంటారు. ఇంతకీ అదేంటంటే.. వన్డే క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్ కావడం. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ డకౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో వన్డే కెరీర్లో 14వ సారి సున్నా వద్దే పెవిలియన్‌కు చేరాడు. ఈ జాబితాలో ద్రవిడ్ (13), రోహిత్ (13)ను కోహ్లీ దాటేశాడు.
ఓపెనర్ నుంచి ఏడో స్థానం వరకు బ్యాటింగ్ చేసే భారత క్రికెటర్లలో అత్యధికసార్లు డకౌట్ అయిన వారిలో సచిన్ తెందూల్కర్ (20), యువరాజ్ సింగ్ (18), సౌరభ్ గంగూలీ (16) ముందున్నారు. తర్వాత సురేశ్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్‌తోపాటు విరాట్ కోహ్లీ (14) జాబితాలోకి చేరాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత అన్నిఫార్మాట్ల సారథ్య బాధ్యతలకు వీడ్కోలు పలికేసి ఓ బ్యాటర్‌గా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడుతున్నాడు. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమితో టీమ్ఇండియా సిరీస్‌ను చేజార్చుకుంది. ఆఖరి వన్డే ఆదివారం జరగనుంది.