Virat Kohli: దిల్లీ అబ్బాయితో.. ముంబయి పిల్లి

గత కొద్ది కాలంగా విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. తాజాగా ఓ పిల్లితో సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను తన అధికారిక ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో..

Updated : 23 Feb 2024 16:23 IST

(Photo: Virat Kohli Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: గత కొద్ది కాలంగా విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. తాజాగా ఓ పిల్లితో సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను తన అధికారిక ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పంచుకున్నాడు. మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తుండగా..‘కూల్‌ క్యాట్‌’ ఆకస్మిక తనిఖీతో ఆశ్చర్యపరిచిందని రాసుకొచ్చాడు. ఆ ఫొటోలు చూసి ముగ్దురాలైన విరాట్‌ కోహ్లి భార్య, బాలివుడ్‌ నటి అనుష్క శర్మ ‘హలో బిల్లీ’ అని పలుకరించారు. దానికి సమాధానంగా ‘దిల్లీ అబ్బాయితో.. ముంబయి పిల్లి’ అని కోహ్లి కామెంట్‌ చేశాడు. 

ప్రస్తుతం విరాట్‌ కోహ్లి విరామం తీసుకుంటున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. అదే జట్టుతో నవంబరు 25 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో కూడా కోహ్లి ఆడటం లేదు. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు అజింక్య రహానె కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు, టీమ్‌ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. డిసెంబరు 3 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు కోహ్లి అందుబాటులోకి రానున్నాడు.

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని