BCCI-Kohli: కోహ్లీ నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి సమాచారం లేదు : బీసీసీఐ

వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమైనట్లు వస్తున్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. ఇప్పటివరకైతే కోహ్లీ వన్డే సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు తమకు..

Published : 15 Dec 2021 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమైనట్లు వస్తున్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. ఇప్పటివరకైతే కోహ్లీ వన్డే సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని పేర్కొంది. ప్రస్తుతానికైతే అతడు వన్డే సిరీస్‌లో ఆడతాడనే భావిస్తున్నామని తెలిపింది. 

‘వన్డే సిరీస్‌ నుంచి కోహ్లీ తప్పుకుంటున్నట్లు ఇప్పటి వరకూ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షాలకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఒకవేళ కోహ్లీ సమాచారం ఇస్తే.. దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికైతే అతడు జనవరి 19, 21, 23న జరిగే వన్డే మ్యాచుల్లో ఆడతాడనే భావిస్తున్నాం. ఆటగాళ్లంతా తమ కుటుంబాలతో కలిసి దక్షిణాఫ్రికా బయలుదేరనున్నారు. టెస్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ కూడా కుటుంబంతోనే బయలుదేరుతాడు. అయితే, బయోబబుల్‌లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం వల్ల టెస్టు సిరీస్‌ తర్వాత విశ్రాంతి తీసుకోవాలనిపిస్తే బీసీసీఐకి కచ్చితంగా సమాచారం అందించాల్సి ఉంటుంది’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

మరోవైపు, దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌ నుంచి కోహ్లీ కచ్చితంగా తప్పుకోవాలనుకుంటే.. ఆ తర్వాత శ్రీలంకతో జరిగే సిరీస్‌కు కూడా అతడు దూరమయ్యే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, గతేడాది కూడా ఇదే సమయంలో కోహ్లీ పితృత్వ సెలవులు తీసుకున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని