కోహ్లీ.. ఈ వరుస ఓటములేంటి?

సుదీర్ఘ ఫార్మాట్‌ కెప్టెన్సీలో విరాట్‌ కోహ్లీ ఎన్నో ఘనతలు సాధించాడు. ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ రికీ పాంటింగ్ (62.33%) తర్వాత అత్యధిక గెలుపు శాతం సాధించిన...

Published : 10 Feb 2021 01:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సుదీర్ఘ ఫార్మాట్‌ కెప్టెన్సీలో విరాట్‌ కోహ్లీ ఎన్నో ఘనతలు సాధించాడు. ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ రికీ పాంటింగ్ (62.33%) తర్వాత అత్యధిక గెలుపు శాతం సాధించిన సారథి కోహ్లీ (57.89%)నే. అయితే విరాట్‌ వరుసగా గత నాలుగు టెస్టుల్లో ఓటమిపాలయ్యాడు. న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టు, చెన్నై వేదికగా జరిగిన ఇంగ్లాండ్ టెస్టులో పరాజయాన్ని చవిచూశాడు.

అయితే కెప్టెన్సీలో కోహ్లీ వరుసగా నాలుగు టెస్టుల్లో ఓటములు చవిచూడటం ఇదే ప్రథమం. అంతకుముందు అతడు వరుసగా ఏడు టెస్టుల్లో విజయం సాధించడం గమనార్హం. కాగా, టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే టీమిండియా.. ఇంగ్లాండ్ సిరీస్‌ను కనీసం 2-1 తేడాతో విజయం సాధించాలి. ఈ నేపథ్యంలో కోహ్లీ గతంలో మాదిరిగా జట్టును విజయాల బాట పట్టించాలని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేస్తున్నారు.

2014లో సారథిగా బాధ్యతలు అందుకున్న కోహ్లీ ఇప్పటివరకు 57 టెస్టులకు నాయకత్వం వహించాడు. 33 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 14 టెస్టుల్లో పరాజయాన్ని చవిచూశాడు. 10 మ్యాచ్‌లు డ్రాగా ముగించాడు. భారత్‌ తరఫున ఎక్కువ టెస్టులకు కెప్టెన్సీ వహించిన రికార్డు ధోనీ పేరిట ఉంది. ధోనీ 60 టెస్టుల్లో 27 విజయాలు, 18 ఓటములు, 15 డ్రాలు సాధించాడు.

ఇవీ చదవండి

చెపాక్‌ ఓటమి: 5 కారణాలివే!

చెన్నె టెస్టు: భారత్‌ ఘోర ఓటమి.. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు