Virat Kohli: ‘నువ్వు వెళ్లే మార్గం నీ మనస్సుకు తెలుసు.. అటువైపుగా పరుగెత్తు’: విరాట్ కోహ్లీ

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు (IND vs NZ) విరామం తీసుకొన్న టీమ్‌ఇండియా (Virat Kohli) స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వ్యక్తిగత జీవితం ఎంజాయ్ చేస్తున్నాడు. వరుసగా ట్రిప్‌లను వేస్తూ బిజిబిజీగా గడిపాడు. ఇక వచ్చే వారం నుంచి ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ (IND vs AUS) ప్రారంభం కానున్న నేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

Published : 02 Feb 2023 14:30 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఇంకో వారం రోజుల సమయం ఉంది. తాజాగా టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను ముగించింది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకొంటున్నారు. ఈ క్రమంలో తనకు దొరికిన బ్రేక్‌ను విరాట్ ఎంజాయ్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల రిషికేష్‌లోని ‘వృందావన్‌ ఆశ్రమం’ను సందర్శించిన విరాట్ దంపతులు.. ట్రెక్కింగ్‌ చేస్తున్న ఫొటోను తమ సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. తాను గడిపిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అద్భుతమైన కొటేషన్‌ను పెట్టాడు. 

‘‘నువ్వు వెళ్లే మార్గం నీ మనసుకు తెలుసు. అదే దిశలో పరుగెత్తు’’ అని విరాట్ కోహ్లీ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీని అభిమానులు పెద్ద సంఖ్యలో షేర్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో అభిమానుల మధ్య చర్చకు తెరతీసింది. కొందరేమో విశ్రాంతి సమయంలో విరాట్ కార్యక్రమాల గురించి చెబుతున్నాడని అంటుండగా.. మరికొందరేమో క్రికెట్‌ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటాడనే కామెంట్లూ చేశారు. అయితే, కోహ్లీ మాత్రం ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టుపై మంచి రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ.. అదే ఊపును కొనసాగించాలని భావిస్తున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి టెస్టు సిరీస్‌ మొదలుకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు