Virat Kohli : ఇది విరాట్‌ నామ సంవత్సరం.. కోహ్లీ ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ అంటూ ప్రశంసలు

Virat Kohli :రికార్డుల రారాజు కింగ్‌ కోహ్లీ.. ఈ ఏడాదిని రెండు అద్భుతమైన సెంచరీలతో ప్రారంభించాడు. దీంతో అతడి ఆటతీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Updated : 16 Jan 2023 13:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ‘అన్న అడుగేస్తే మాస్‌.. అన్న లుక్కేస్తే మాస్‌..’ ఈ మాస్‌ బీట్‌ను ఇప్పుడు క్లాస్‌ ప్లేయర్‌ కింగ్‌ కోహ్లీ(Virat Kohli)కి అన్వయించుకోవాలేమో. ఎందుకంటే విరాట్‌ అడుగేస్తే సెంచరీ.. లుక్కేస్తే శతకం అన్నట్లుగా ఈ కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించి తన శతకాల దాహం తీర్చుకుంటున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఆడింది మూడు వన్డేలే.. అందులో రెండు గొప్ప శతకాలతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇక కోహ్లీ వన్డేల్లో ఆడిన గత నాలుగు ఇన్నింగ్స్‌లను తీసుకుంటే.. ఇది అతడికి మూడో సెంచరీ. ఈ క్రమంలో గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ సచిన్‌ రికార్డులే లక్ష్యంగా ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు. ఇది విరాట్‌ (Virat Kohli) నామ సంవత్సరమే అన్నట్లుగా రికార్డులను లిఖిస్తున్నాడు.

శ్రీలంకతో జరిగిన చివరి వన్డే(IND Vs SL)లో ఈ పరుగుల యంత్రం (166*: 110  బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్‌లు) తన వన్డే కెరీర్‌లో రెండో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. దీంతో కోహ్లీ ప్రదర్శనపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. విరాట్‌ది అద్భుత ఇన్నింగ్స్‌ అంటూ కొనియాడుతున్నారు.

* వైట్‌బాల్‌ క్రికెట్‌లో విరాట్‌ అత్యుత్తమ ప్రదర్శనతో తిరిగిరావడం అద్భుతం. అజేయమైన 166 పరుగులు అతడి అత్యుత్తమమైన ప్రమాణాలకు ఎంతో ప్రత్యేకం - వీవీఎస్‌ లక్ష్మణ్‌.

* ‘క్రికెట్‌లో గ్రేట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌(GOAT) కోహ్లీయే. ఫుట్‌బాల్‌లో దిగ్గజ ఆటగాడు లియోనెల్‌ మెస్సి ఎలాగో.. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ కూడా GOAT. 2023 కోసం కోహ్లీ స్క్రిప్ట్‌ చక్కగా రాసుకున్నాడు’ -శ్రీలంక మాజీ ఆటగాడు ఫర్వీజ్‌ మహరూఫ్‌

* ‘కోహ్లీ గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు బాదడం నాకు ఆశ్చర్యం అనిపించలేదు. విరాట్‌ ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చాడంటే.. దాన్ని కొన్నేళ్లపాటు కొనసాగిస్తాడు’- భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్‌

* పాక్‌లోని అభిమానులు కూడా కోహ్లీని ఆకాశానికెత్తుతున్నారు. వన్డే ఫార్మాట్‌లో బాబర్‌ అజామ్‌.. కోహ్లీకి ఏ మాత్రం సరిపోడని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని