Virat Kohli : జిమ్‌లో విరాట రూపం..! ఉత్సాహంగా కోహ్లీ కసరత్తులు..!

రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం సరైన ఫామ్‌ లేక ఇబ్బంది పడుతున్నా.. టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడే. ప్రస్తుతం టీ20 మెగా

Updated : 07 Dec 2022 14:45 IST

విరాట్‌ ఫిట్‌నెస్‌ లక్ష్యాలను వెల్లడించిన బెంగళూరు ట్రైనర్‌

ముంబయి : రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం సరైన ఫామ్‌ లేక ఇబ్బంది పడుతున్నా.. టీమ్‌ఇండియాలో కీలక ఆటగాడే. ప్రస్తుతం టీ20 మెగా టోర్నీలో ఆటగాళ్లంతా నిమగ్నమైనప్పటికీ.. ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. అందుకోసం ఇప్పటి నుంచే సరైన ప్రణాళికలతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విరాట్‌ కూడా సన్నద్ధమవుతున్నాడు. ఫిట్‌నెస్‌ పరంగా మరింత మెరుగయ్యేందుకు కృషి చేస్తున్నాడు.

ప్రస్తుతం బెంగళూరు ట్రైనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న శంకర్‌ బసు విరాట్‌ ఫిట్‌నెస్‌ వివరాలను వెల్లడించాడు. ‘విరాట్‌కు ముఖ్యంగా కండలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. టీ20కి శక్తితో కూడిన కదలికలు అవసరం. శక్తిప్రదర్శన అనేది టీ20 నుంచి లభించే అదనపు హంగు. ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో.. దీర్ఘకాలిక.. స్వల్పకాలిక అవసరాల కోసం అతడు బలంగా ఉండటం ఎంతో అవసరం’ అని బసు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియలోను బెంగళూరు యూట్యూబ్‌ పేజీలో పంచుకున్నారు.

‘చిన్న పిల్లల్లో ఉండే ఉత్సాహం అతడిలో ఇప్పటికీ ఉంది. అది నన్నెంతో ఆశ్చర్యపరుస్తోంది. 19 లేదా 20 ఏళ్లలో అతడిలో చూసిన ఉత్సాహం ఇప్పటికీ ఒక్క శాతం కూడా తగ్గలేదు సరికదా పెరుగుతూనే ఉంది. అతడి ఉక్కు సంకల్పం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమే’ అని కోహ్లీ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ ప్రణాళికను బసు వివరించారు.

ఇక టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్‌(3313 పరుగులు) తర్వాతి స్థానంలో కోహ్లీ (3296 పరుగులు) కొనసాగుతున్నాడు.  టీమ్‌ ఇండియా 2013 తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా నెగ్గలేదు. ఈ నేపథ్యంలో వచ్చే టీ20 ప్రపంచక్‌ప్‌లో గెలిచి ఆ కొరతను తీర్చాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని