IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లను ఎగతాళి చేయడం కోహ్లీకి ఇష్టం: సంజయ్ బంగర్
భారత్, ఆసీస్ (IND vs AUS) మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) రాణిస్తాడని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో ఆడటమంటే విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఎంతో ఇష్టమని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో అతడు కీలకపాత్ర పోషిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవల ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ వన్డేలతోపాటు టీ20ల్లో శతకం సాధించాడు. కానీ, అతడు టెస్టుల్లో శతకం బాది మూడేళ్లు దాటిపోయింది. కోహ్లీ ఆ లోటును కూడా బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తీర్చేస్తాడని సంజయ్ బంగర్ (Sanjay Bangar) అన్నాడు. ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు జరుగనుంది.
‘ఆస్ట్రేలియాతో ఆడటానికి, ఆ జట్టు ఆటగాళ్లను ఎగతాళి చేయడానికి కోహ్లీ ఇష్టపడతాడు. విరాట్ తన ఆటను మెరుగుపర్చుకుంటాడు. టెస్టు క్రికెట్ అనేది కోహ్లీ నుంచి అత్యుత్తమ ప్రదర్శనను అందించే ఫార్మాట్ కూడా. అవును.. గత రెండున్నరేళ్లుగా అతడు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. వన్డేలు, టీ20ల్లో ఆస్వాదించిన తాజాదనాన్ని కొనసాగించాలనుకుంటున్నాడు. ఇప్పుడు టెస్టు క్రికెట్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి, కోహ్లీ మంచి ఆటతీరును కనబర్చి ఈ సిరీస్‌పై ప్రభావం చూపుతాడు. టెస్టు ఫార్మాట్‌లో ఎదురయ్యే సవాళ్లను కోహ్లీ అధిగమిస్తాడని మేము చాలా ఆశాభావంతో ఉన్నాం’ అని సంజయ్ బంగర్ వివరించాడు. ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు 20 టెస్టులు ఆడిన కోహ్లీ.. 48.05 సగటుతో 1,682 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
General News
పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?
-
Ts-top-news News
38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి