
Virat Kohli: బెంగళూరు అభిమానులకు విరాట్ కోహ్లీ స్పెషల్ మెసేజ్
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్‌లో ఏటా ‘ఈ సాలా కప్ నమదే’ అంటూ వచ్చే బెంగళూరును ఈ సారి కూడా దురదృష్టం వెంటాడింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో బెంగళూరుపై రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టైటిల్ కల నెరవేరకుండానే బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ పరిణామంతో ఇటు బెంగళూరు, అటు విరాట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొంతమంది అభిమానులు భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక కన్నీరు కూడా పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టుపై చూపుతున్న ప్రేమాభిమానాలను దృష్టిలో ఉంచుకుని ట్విటర్ వేదికగా అభిమానులను ఉద్దేశించి విరాట్ కోహ్లీ ఓ స్పెషల్ మెసేజ్ చేశాడు. ‘కొన్నిసార్లు మీరు (అభిమానులు) గెలుస్తారు, కొన్నిసార్లు మీరు గెలవలేరు. ఈ సీజన్ అంతా మాకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆటను ప్రత్యేకంగా ఉండేలా చేశారు. నేర్చుకోవడం ఎప్పుడూ ఆగదు. ఈ అద్భుతమైన ఫ్రాంచైజీలో భాగమైన యాజమాన్యానికి, సహాయక సిబ్బందికి, అభిమానులకు కృతజ్ఞతలు. మళ్లీ వచ్చే సీజన్‌లో కలుద్దాం’ అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ సీజన్‌లో కోహ్లీ బ్యాటర్‌గా నిరాశపరిచాడు. 16 మ్యాచ్‌లు ఆడి 22.73 సగటుతో 341 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉండగా, ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే టీ20 లీగ్ ఫైనల్‌లో గుజరాత్, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
General News
Cesarean Care: శస్త్రచికిత్స తర్వాత ఏం జరుగుతుందంటే...!
-
Technology News
Xiaomi 12S Ultra: సోని సెన్సర్‌తో షావోమి ఫోన్ కెమెరా.. ఇక మొబైల్‌తోనే వీడియో షూట్!
-
General News
HMDA: హెచ్ఎండీఏ ఈ-వేలానికి ఆదరణ.. తుర్కయాంజిల్‌లో గజం రూ.62,500
-
General News
Health: మత్తు వ్యసనాలను వదిలించుకోండి ఇలా..!
-
Movies News
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- Income Tax Rules: రేపటి నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- iPhone 12: యాపిల్ ఐఫోన్ 12పై ఆఫర్..₹ 20 వేల వరకు తగ్గింపు!
- Revanthreddy: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలిసేందుకు సిద్ధంగా లేము: రేవంత్‌రెడ్డి
- Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే, డిప్యూటీ సీఎంగా ఫడణవీస్ ప్రమాణ స్వీకారం
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?